BRS: తెలంగాణ‌లో సంచ‌ల‌నం.. గులాబీ పార్టీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ?

BRS
BRS
BRS

BRS: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అటు భారతీయ జనతా పార్టీకి చెందిన బడా లీడర్లు కూడా మళ్లీ గులాబీ గూటికి వెళుతున్నారు. మున్సిపల్ ఎన్నికల కంటే ముందు వరంగల్ లో బడా లీడర్ అయిన ఆరూరి రమేష్, భారతీయ జనతా పార్టీకి షాక్ ఇచ్చి మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు. BRS

Congress Gudem Mahipal Reddy into BRS

నిన్న కేటీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరిన ఆరూరి రమేష్, కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఇదంతా పక్కకు పెడితే, గులాబీ పార్టీ ఘర్ వాపసి పేరుతో పాత లీడర్లను మళ్లీ పార్టీలోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీ నుంచి గెలిచిన పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని కూడా పార్టీలోకి ఆహ్వానించనుందట. BRS

Also Read: Ajit Pawar-plane crash: విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి

ఇటీవల కాలంలోనే కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ కెసిఆర్ ను మెచ్చుకున్నారు గూడెం మహిపాల్ రెడ్డి. కాంగ్రెస్ లోకి వస్తే ప్రయోజనం లేకుండా పోయిందని విమర్శలు చేశారు. అయితే అతి త్వరలోనే అంటే మున్సిపల్ ఎన్నికలలోపే గులాబీ గూటికి గూడెం మహిపాల్ రెడ్డి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ సమక్షంలోనే గులాబీ పార్టీ కండువా కప్పుకోనున్నారట. గూడెం మహిపాల్ రెడ్డి ఒక్కడే కాకుండా మరికొంతమంది లీడర్లు కూడా సొంతగూటికి రాబోతున్నారట. BRS

Also Read: Deputy CM Ajit Pawar : అజిత్ పవార్ విమాన ప్రమాదంపై సంచలన వీడియో

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu