Ambati Rambabu: అంబటి రాంబాబు ఇష్యూ.. హైదరాబాద్‌లో టీడీపీ కార్యకర్తల నిరసన

Ambati Rambabu
Ambati Rambabu
Ambati Rambabu

Ambati Rambabu: అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్య‌లు దూమారం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ త‌రుణంలోనే అంబ‌టి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, అంబటి రాంబాబు వ్యాఖ్యలపై హైదరాబాద్‌లో టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి పంజాగుట్ట శ్మ‌శాన వాటిక వరకు అంబటి రాంబాబు దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వ‌హించి, అంత్యక్రియలు చేశారు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి, వీడియో వైర‌ల్ గా మారింది. Ambati Rambabu

Ambati Rambabu TDP workers protest in Hyderabad

ఇది ఇలా ఉండ‌గా, బిజెపి ఎంపీ పురందేశ్వరి ఈ అంశంపై స్పందించారు. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని విమ‌ర్శ‌లు చేశారు. చంద్రబాబు తల్లిని అవమానించే విధంగా అంబటి వ్యాఖ్యలు ఉన్నాయని వెల్ల‌డించారు. మహిళ లోకం కూడా అంబటి వ్యాఖ్యలను సహించదంటూ హెచ్చ‌రించారు.Ambati Rambabu

Also Read: MLA Arava Sridhar: ఎమ్మెల్యే శ్రీధర్ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్‌..హర్షవీణ మ‌రో వీడియో

ప్రధాని మోదీ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సుపరిపాలన అందిస్తున్నాని గుర్తు చేశారు. ఏపీలో శాంతిభద్రతలు ఉన్నాయా లేదా అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలుసు అని వ్యాఖ్యానించారు. కావాలని రాష్ట్రంలో అల్లర్లు సృష్టించారని ఫైర్ అయ్యారు. జగన్ కనుసన్నల్లోనే జోగి రమేష్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు బిజెపి ఎంపీ పురందేశ్వరి. Ambati Rambabu

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu