Rajyasabha elections: రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌.. తెలంగాణ ఎన్ని స్థానాలు ఖాళీ అంటే..?

Rajyasabha Elections
Rajyasabha Elections

Rajyasabha elections: తెలంగాణ‌లో ఇటీవ‌ల మున్సిప‌ల్ ఎన్నిక‌లు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రో ఎన్నిక‌లు రాబోతున్నాయి. తాజాగా ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల అయింది. దేశ‌వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రాజ్య‌స‌భ స్థానాల‌కు భార‌త ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసింది. దేశ వ్యాప్తంగా 37 మంది రాజ్య‌స‌భ ఎంపీల ప‌ద‌వీకాలం పూర్తి కానుంది. దీంతో ఖాళీ అయ్యే స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ ని తాజాగా విడుద‌ల చేసింది. Rajyasabha elections

Rajya Sabha Election Schedule Released

తెలంగాణ‌లో రెండు స్థానాల్లో ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. బీఆర్ఎస్ నుంచి కే.ఆర్. సురేష్ రెడ్డి, కాంగ్రెస్ త‌ర‌పున అభిషేక్ మ‌ను సింఘ్వి తెలంగాణ నుంచి రాజ్య‌స‌భ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. వీరి ప‌ద‌వీ కాలం ఏప్రిల్ 09వ తేదీతో ముగియ‌నుంది. దీంతో తాజాగా షెడ్యూల్ విడుద‌ల అయింది. ఈనెల 26న నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. మార్చి 16న పోలింగ్ జ‌రుగ‌నుంది. Rajyasabha elections

Also Read : KONDA SUREKHA :వేలిముద్ర వాళ్లు కూడా సీఎం అవుతారు.. కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మార్చి 5 వ‌ర‌కు అభ్య‌ర్థుల నుంచి నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. మార్చి 06న స్క్రూట్నీ మార్చి 09న నామినేష‌న్ల విత్ డ్రా అవ‌కాశం క‌ల్పించారు. మార్చి 16న ఉద‌యం 9 గంట‌ల నుంచి 4 గంట‌ల వ‌ర‌కు పార్ల‌మెంట్ లో పోలింగ్ జ‌రుగ‌నుంది. అదేరోజు సాయంత్రం 5 గంట‌ల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మ‌వుతుంది. మార్చి 20 నాటికి దేశ‌వ్యాప్తంగా రాజ్య‌స‌భ ఎన్నిక‌లు ముగియ‌నున్నాయి. Rajyasabha elections:

Also Read : KONDA SUREKHA :వేలిముద్ర వాళ్లు కూడా సీఎం అవుతారు.. కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు