Heritage : 20 నెలల్లో సగానికి పైగా పడిపోయిన హెరిటేజ్ షేర్లు

Heritage

Heritage : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స్థాపించిన హెరిటేజ్ షేర్లు ఇప్పుడు ఒక్క‌సారిగా ప‌డిపోయాయి. 20 నెల‌ల్లో స‌గానికి పైగా ప‌డిపోయాయి. రెండేళ్ల‌లో 2024లో కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన జూన్ నాటికి ఆల్ టైమ్ హ‌య్యెస్ట్ రూ.695 ట‌చ్ అయింది హెరిటేజ్ షేర్. కానీ ప్ర‌స్తుతం హెరిటేజ్ షేర్ విలువ స‌గానికి పైగా ప‌డిపోయింది. దాదాపు 20 నెల‌ల త‌రువాత హెరిటేజ్ షేర్ ప‌డిపోవడం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన 6 నెల‌ల త‌రువాత క్షీణించ‌డం ప్రారంభించింది. Heritage

Heritage shares have more than halved in 20 months

మ‌రోవైపు తిరుమ‌ల ల‌డ్డూ నెయ్యి వివాదం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ బొత్స సత్య‌నారాయ‌ణ హెరిటేజ్ తో ఇందాపూర్ డెయిరీ, భోలేబాబా డెయిరీతో సంబంధాలు ఉన్నట్టు ఆరోప‌ణ‌లు చేశారు. ఇందాపూర్ డెయిరీతో ఎలాంటి సంబంధం లేక‌పోయినా 2014-19 మ‌ధ్య ఆ సంస్థ పేరుతో హెరిటేజ్ టీటీడీ కి నెయ్యి స‌ర‌ఫరా చేసిందంటూ త‌ప్పుడు ఆ రోప‌ణ‌లు చేశార‌ని హెరిటేజ్ సంస్థ త‌ర‌పున న్యాయ‌వాది జి.మ‌ల్లికార్జున రావు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు లీగ‌ల్ నోటీసులు పంపారు. Heritage

Also Read : Balka Suman : బాల్క సుమ‌న్ అరెస్ట్.. 14 రోజుల రిమాండ్.. కార‌ణం అదేనా..?

అస‌త్య‌, నిరాధార ఆరోప‌ణ‌ల‌తో పాటు త‌మ సంస్థ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసే కుట్ర‌కు పాల్ప‌డ్డార‌ని నోటీసుల్లో పేర్కొంది. అత్యున్న‌త ప్ర‌మాణాలు పాటిస్తూ ద‌శాబ్దాలుగా ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని పొందిన హెరిటేజ్ సంస్థ పై త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డం పై స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేసింది.

Also Read : NARA LOKESH :నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. లోకేశ్ సెటైర్

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_