

ANDHRAPRADESH : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఔట్ సోర్సిగ్ ఉద్యోగుల గురించి ఇవాళ ఏపీ అసెంబ్లీలో చర్చ జరిపారు. ఈ చర్చలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తించవని తేల్చారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రిడోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తించవని.. ఇది ఇంతకు ముందు నుంచే వస్తున్నదని చెప్పారు. ANDHRAPRADESH
SHOCK FOR OUT SOURCING EMPLOYEES THEY AR INELIGIBLE FOR GOVERNMENT SCHEMES
మున్సిపాలిటీలలో పని చేసే పారిశుధ్య కార్మికులకు సైతం ఆదాయం ఎంత ఉన్నా ఇందులో వెసులు బాటు కల్పించారని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలకు వారు అర్హులేనని చెప్పారు. మిగతా ఔట్ సోర్సింగ్ విభాగానికి చెందిన ఉద్యోగులకు వేతనం ఎంత ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలకు అనర్హులేనని వెల్లడించారు. ANDHRAPRADESH
Also Read : DONALD TRUMP : తాను యుద్ధం ఆపకపోతే పాక్ ప్రధాని చనిపోయేవారు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి లక్ష 20వేల కంటే ఎక్కువ వేతనం, పట్టణ ప్రాంతాల్లో నెలకు లక్ష44వేల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నట్టయితే ప్రభుత్వ పథకాలు వర్తించవని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల ప్రభుత్వ ఉద్యోగులు సైతం ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని దానిపై త్వరలోనే విచారణ చేపడుతామని మంత్రి తెలిపారు.
Also Read : AP HIGH COURT : ఏపీ సీఎస్ విజయానంద్ పై హైకోర్టు సీరియస్.. ఎందుకంటే..?
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





