AP HIGH COURT : ఏపీ సీఎస్ విజ‌యానంద్ పై హైకోర్టు సీరియ‌స్.. ఎందుకంటే..?

ap high court

AP HIGH COURT : ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు ఆదేశాలు అమ‌లు చేయ‌క‌పోవ‌డం పై న్యాయస్థానం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. కోర్టు ఆదేశాలు అమ‌లు చేస్తారా..? లేదా చెప్పాలని సీఎస్ విజ‌యానంద్ ని ప్ర‌శ్నించింది. క‌చ్చితంగా చేస్తామ‌ని కోర్టుకు సీఎస్ తెలిపారు. ఎప్ప‌టిలోగా అమ‌లు చేస్తార‌ని కోర్టు ప్ర‌శ్నించింది. రీజ‌న‌బుల్ టైమ్ లో చేశామ‌న్న సీఎం.. 15 రోజుల స‌మ‌యం స‌రిపోదా అని సీఎస్ ను కోర్టు ప్ర‌శ్నించింది. త‌మ ఆదేశాలు అమ‌లు చేయ‌క‌పోతే కోర్టులు ఎందుకు అని న్యాయ‌మూర్తి అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. AP HIGH COURT

HIGH COURT IS SERIOUS ABOUT AP CS VIJAYANAND

అధికారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిదేన‌ని న్యాయ‌స్థానం పేర్కొంది. కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను అమ‌లు చేయ‌క‌పోతే సామాన్య ప్ర‌జ‌ల‌కు కోర్టుల‌పై న‌మ్మ‌కం కోల్పోతార‌ని తెలిపింది. కోర్టు ఆదేశాల పై అధికారుల‌కు గౌర‌వం లేక‌పోయినా అధికారుల‌పై మాకు గౌర‌వం ఉంద‌న్నారు. AP HIGH COURT

Also Read : DONALD TRUMP : తాను యుద్ధం ఆపకపోతే పాక్ ప్రధాని చనిపోయేవారు.. ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సీఎస్ హైకోర్టు ఆదేశాలు పాటించ‌కుండా మిగ‌తా అధికారుల‌కు ఏమి మెస్సేజ్ ఇస్తున్నార‌ని డివిజ‌న్ బెంచ్ ప్ర‌శ్నించింది. సీఎస్ ను వివ‌ర‌ణ అడిగితే ఏజీ వాద‌న‌లు వినిపించ‌డం పై అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఫోక‌ల్ నాన్ ఫోక‌ల్ పోస్టుల‌పై స‌రైన క్లారిటీ లేద‌ని అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ పేర్కొన్నారు. పోస్టుల‌పై పూర్తి క్లారిటీ ఉంద‌ని చెప్ప‌మంటే చెబుతాన‌ని న్యాయ‌స్థానం ప్ర‌శ్నించింది. కోర్టు ఆదేశాలు అమ‌లు చేయ‌క‌పోవ‌డంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయ‌ని ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు కోర్టుకు ఏజీ వెల్ల‌డించారు. కోర్టు ఆదేశాల‌తో సిట్ ఏర్పాటు చేసామ‌ని సీఎస్ విజ‌యానంద్ తెలిపారు. AP HIGH COURT

Also Read : CM REVANTH REDDY : కృష్ణా, గోదావ‌రి జ‌లాల పంపిణీ.. సీఎం రేవంత్ రెడ్డి సెన్షేష‌న‌ల్ ట్వీట్..!

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu