
CM REVANTH REDDY : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తన మాటలకు ఎంతటి వారైన మంత్ర ముగ్దులు కావాల్సిందే. మాటలతో ఆకట్టుకోవడంలో దిట్ట. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఓ ఘనతను సాధించారు. ఎంతో ఉత్సాహంతో స్టూడెంట్ గా మారిపోయారు. రేవంత్ రెడ్డి స్టూడెంట్ గా ఎప్పుడూ మారిపోయారని చాలా మందికి డౌట్ రావచ్చు. CM REVANTH REDDY
yesterday-student-tomorrow-speaker-the-only-one-in-the-country-cm-revanth-reddy
అదేనండీ.. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలోని కెనెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ లో లీడర్ షిప్ కోర్సును రేవంత్ రెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నుంచి కోర్సు సర్టిఫికేట్ కూడా అందుకున్నారు. జనవరి 25 నుంచి 30 వరకు లీడర్ షీప్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ పేరిట నిర్వహించిన క్లాస్ లకు హాజరయ్యారు. దాదాపు 20 దేశాల నుంచి వచ్చిన 60 మంది విద్యార్థులతో కలిసి క్లాస్ లు విన్నారు.
Also Read : AP HIGH COURT : ఏపీ సీఎస్ విజయానంద్ పై హైకోర్టు సీరియస్.. ఎందుకంటే..?
పదవీలో ఉన్న భారతదేశానికి చెందిన సీఎంలలో హార్వర్డ్ నుంచి నాయకత్వ కోర్సులో సర్టిఫికేట్ పొందిన తొలి సీఎం రేవంత్ రెడ్డి నిలిచారు. ఇది ఒక అరుదైన ఘనత అనే చెప్పుకోవచ్చు. మరో ఘనత కూడా సాధించారు. ఎక్కడైతే ఆయన ఓ స్టూడెంట్ గా ఉన్నారో.. అక్కడే కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ లో ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించబోతున్నారు. మార్చి 27న హార్వర్డ్ స్కూల్ క్యాంపస్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది. భారతదేశం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరే ఆహ్వానం అందుకోవడం విశేషం.
Also Read : ANDHRAPRADESH : ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు షాక్.. ప్రభుత్వ పథకాలకు వారు అనర్హులే..!
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





