
NARA LOKESH : రాజకీయాల్లో అధికారం కోసం పరిగెత్తే వాళ్లు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు సీఎం కుర్చీ పై కూర్చోవాలని చాలా మంది భావిస్తుంటారు. ఉదాహరణకు తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అవుతారని ఎవ్వరూ ఊహించలేదు. కేసీఆర్ తరువాత సీఎం రేవంత్ రెడ్డి కావడం గొప్ప విషయమనే చెప్పాలి. ఏపీలో కూడా సీఎం నారా చంద్రబాబు నాయుడు తరువాత తన కుమారుడు నారా లోకేష్ సీఎం అయ్యే అవకాశాలున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
PAVING THE WAY FOR NARA LOKESH CORONATION
త్వరలోనే ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్. అయితే 2029లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే.. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి రెండేళ్ల సీఎం పదవీ ఇస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అదే సమయంలో చంద్రబాబు సూచన ప్రకారం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంగీకరించారు.
Also Read : TRANSPORT : తెలంగాణలో భారీగా పెరగనున్న వాహనాల ధరలు.. ఉత్తర్వులు జారీ..!
అయితే మూడేళ్లు నారా లోకేష్.. రెండేళ్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎంగా కొనసాగుతారని ప్రచారం జరుగుతోంది. దీంతో నారా లోకేష్ పట్టాభిషేకానికి మార్గం సుగమం అయిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టడం విశేషం. ఏది ఏమైనా చంద్రబాబు తరువాత తన వారసుడు నారా లోకేష్ సీఎం కావడం గ్యారెంటీ అని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు లోకేష్ మామ నందమూరి బాలకృష్ణ కూడా చంద్రబాబు నాయుడు తరువాత తన అల్లుడిని సీఎంగా చూడాలని భావిస్తున్నట్టు సమాచారం.
Also Read : NARA LOKESH : మంత్రి నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన హీరోయిన్ జాన్వీ కపూర్..!





