మాజీ ముఖ్యమంత్రి జగన్ టెట్ నిబంధనలతో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్పందించి, చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చారు. సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన పోస్ట్ లో ఏపీ ప్రభుత్వానికి సంచలన సూచనలు చేశారు. దాదాపు లక్ష మందికి పైగా ఉపాధ్యాయులు ఈ నిబంధనల వల్ల తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని జగన్ ధ్వజమెత్తారు.
చంద్రబాబును ట్యాగ్ చేస్తూ జగన్ చేసిన ఆ ట్వీట్ లో… చంద్రబాబు గారూ, టెట్ ఇప్పుడు నిబంధనలతో టీచర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు పట్టించుకోకపోవడం అన్యాయం. టెట్ పరీక్షలో పాస్ కావాలని రూల్ పెట్టడం ఎంతవరకు కరెక్టు? అని ప్రశ్నించారు. 2011 కంటే ముందు నుంచి సర్వీసులో ఉన్న టీచర్లకు కూడా టెట్ ఎందుకు తప్పనిసరి చేశారని నిలదీశారు. ఈ టీచర్ల ఇబ్బందుల గురించి చంద్రబాబు పట్టించుకోవడం లేదని జగన్ విమర్శలు చేశారు.
జాతీయ విద్యాహక్కు చట్టం 2011 నుంచి టెట్ తప్పనిసరి అని, కానీ ఆ చట్టం రాకముందు నుంచి టీచర్ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ నిబంధన ఎందుకు వర్తించాలని జగన్ వాదనలు వినిపించారు. టీచర్లంతా వాపోతున్నారు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి మాటలు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. టెట్ నిబంధనలతో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని సూచించారు.
చివరగా, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని జగన్ డిమాండ్ చేశారు. టెట్ నిబంధనలను సడలించాలని లేదా ముందు నుంచి ఉద్యోగంలో ఉన్న వారికి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని చంద్రబాబుకు సూచనలు చేశారు. ఉపాధ్యాయుల భవిష్యత్తు కోసం ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలని జగన్ ట్వీట్ తో తేల్చారు.





