తెలంగాణ లారీ ఓనర్స్ సంఘం Single Permit అమలు కోసం పెద్ద ఎత్తున ఉద్యమించనున్నట్లు ప్రకటించింది. ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తూ, సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయకపోతే తీవ్ర నిరసన తెలపడానికి సిద్ధమని హెచ్చరించారు. తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ సంఘం అధ్యక్షుడు సూర్వి యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో ఈ లేఖను పంపారు.
ప్రస్తుతం ఏపీలోకి తెలంగాణ లారీలు వెళ్తే రూ. 15 వందల ఫైన్ విధిస్తున్నారు. సింగిల్ పర్మిట్ కోసం ఎన్నిసార్లు డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తెలుగు రాష్ట్రాల మధ్య గూడ్స్ వాహనాలకు ‘కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్’ ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ Single Permit అమలు వలన లారీ యజమానులకు, డ్రైవర్లకు చాలా వరకు సమస్యలు తీరిపోతాయి.
తెలంగాణలో దాదాపు 2 లక్షలకు పైగా లారీలు ఉన్నాయి. వీటిలో 80 శాతం స్టేట్ పర్మిట్ కలిగినవే ఉన్నాయి. రోజూ వేల సంఖ్యలో వాహనాలు తెలంగాణ-ఏపీ మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ పరిస్థితిలో సింగిల్ పర్మిట్ లేకపోవడం వలన లారీ యజమానులకు భారీగా నష్టం వస్తుందని సంఘం నేతలు అభిప్రాయపడ్డారు. కావున వెంటనే ఈ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సంఘం నాయకులు ఇప్పటికే ఈ విషయంపై అనేక సార్లు ప్రభుత్వాన్ని కోరినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు Single Permit అమలు కోసం పెద్ద ఎత్తున ఉద్యమించబోతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ లారీ ఓనర్స్ సంఘం ఈ పోరాటంలో ముందుంటుందని, అవసరమైతే రోడ్డు మార్గాలను దిగ్బంధం చేసే అవకాశం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది.





