వసుదేవ సుతం సినిమా రేపు జులై 10న రిలీజ్ కాబోతుంది, ఇప్పుడు ట్రైలర్ ని సినీ దర్శకుడు అజయ్ భూపతి లాంచ్ చేశారు. ఈ సినిమా మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రెయిన్బో సినిమాస్ బ్యానర్ పై ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను దర్శకత్వం వహిస్తున్నారు.
ట్రైలర్ లో డిఫరెంట్ డైలాగ్స్, విజువల్స్ మరియు యాక్షన్ సీక్వెన్సెస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చంపడం నాకు సరదా కాదు.. అలా అని క్షమించడం చేతకాదు, కొన్ని తప్పుల్ని క్షమించొచ్చు.. కానీ అన్ని తప్పులు క్షమిస్తే మనం కూడా తప్పు చేసినట్టే, దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే వాళ్లకు భూమి మీద హక్కు లేదు వంటి పవర్ఫుల్ డైలాగ్స్ సినిమాకి అదనపు బలం.
ఈ ట్రైలర్ ని విడుదల చేసిన సందర్భంగా అజయ్ భూపతి మాట్లాడుతూ, ట్రైలర్ చాలా బాగుందని, విజువల్స్ మరియు యాక్షన్ సీక్వెన్సెస్ ఆకట్టుకున్నాయని మూవీ యూనిట్ ని అభినందించారు. ఆయన సినిమా మంచి బాక్సాఫీస్ విజయం సాధించాలని ఆశీర్వదించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ప్రమోషనల్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి.
వసుదేవ సుతం సినిమాకు U/A సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ సభ్యులు కూడా ఈ సినిమా కుటుంబ సమేతంగా చూడడానికి పర్ఫెక్ట్ అని, కొత్త కథతో తెరకెక్కించారని మూవీ యూనిట్ ని అభినందించినట్లు తెలుస్తుంది. జులై 10న టికెట్స్ బుక్ చేసుకుని ఈ వసుదేవ సుతం సినిమాను ఆస్వాదించడం మిస్ అవ్వకండి.





