Iran: ఇరాన్‌ను బుగ్గి చేస్తానంటున్న ట్రంప్ – ప్రపంచంలో ఉద్రిక్తత

ట్రంప్ ఇరాన్‌ను బుగ్గి చేస్తానని హెచ్చరించడంతో ప్రపంచంలో ఉద్రిక్తత మళ్లీ పెరిగింది. అమెరికా అధ్యక్షుడు ఇరాన్ అస్తిత్వమే లేకుండా చేస్తామని, వారితో చర్చలు అనే మాట ఇక ఎత్తేది లేదని స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధిలో అమెరికా నౌకలపై ఇరాన్ సైన్యం దాడి చేసిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

దాడి వివరాల్లోకి వెళ్తే, శాంతి ఒప్పందం నెపంతో ఇరాన్ తన జలాల్లో నిఘా పెంచుతోందని ఆరోపిస్తూ, అమెరికాకు చెందిన మూడు వాణిజ్య నౌకలను ఇరాన్ టార్గెట్ చేసింది. దీంతో ట్రంప్ ఆగ్రహోదగ్రులై ఇరాన్‌ను క్షమించేది లేదని, చర్చలు ప్రసక్తే లేదని ప్రకటించారు. ఇరాన్ క్షమించరాని తప్పులు చేస్తున్నారు; వారిని బుగ్గి చేస్తాం, ఏమీ మిగల్చం అని ట్రంప్ హెచ్చరించారు.

ఈ హెచ్చరికలతో పాటు అమెరికా సైన్యం ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై దాడులు మొదలుపెట్టింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇరాన్‌ను హెచ్చరిస్తూ, హోర్ముజ్ జలసంధిలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ఉపేక్షించేది లేదని చెప్పారు. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది.

ప్రపంచ దేశాలు ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే స్థితి దారిలోకి వస్తుందనుకున్న సమయంలో ఇరాన్‌పై అమెరికా విరుచుకుపడటం, ప్రతిగా ఇరాన్ దాడులు ముమ్మరం చేయడంతో హోర్ముజ్ జలసంధిపై ప్రభావం పడుతోంది. దీనివల్ల మళ్లీ చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ పరిస్థితి ఇలా తలకిందులవడంతో ప్రపంచం మొత్తం గగ్గోలు పెడుతోంది.

Share your love