రాత్రి 7 తర్వాత భోజనం చేయకూడదా? డాక్టర్లు చెప్పే వాస్తవాలు

Circadian Rhythm అనేది శరీరం లోపల ఉన్న 24 గంటల biological clock. ఇటీవల ఇండియాస్ గాట్ లాటెంట్ 2 షోలో హర్ష్ లింబాచియా ఒక పోటీదారుడికి సాయంత్రం 7 గంటలలోపు భోజనం చేసి, రాత్రి 10-10:30కి నిద్రపోవాలని సలహా ఇచ్చారు. ఇది Circadian Rhythm ను follow చేస్తే లైఫ్ సెట్ అవుతుందని చెప్పారు. కానీ నిజంగా ఈ నియమం అందరికీ అవసరమా లేదా అనేది ప్రశ్న. డాక్టర్లు మాత్రం ఇది ఒక general guideline మాత్రమేనని అంటున్నారు.

What is Circadian Rhythm and why it matters

ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మనన్ వోహ్రా ప్రకారం, ఈ internal clock మన హార్మోన్లు, digestion, body temperature, appetite అన్నిటినీ control చేస్తుంది. చాలా మంది తెలియకుండానే ఈ rhythm ను disrupt చేస్తున్నారు. ఉదయం సూర్యకాంతి లేదు, అర్థరాత్రి భోజనం చేస్తున్నారు. మన శరీరానికి perfection కాదు, consistency కావాలి. ఒకే సమయంలో మేల్కోవడం, sleep schedule మెయింటైన్ చేయడం వల్ల కాలేయం, గట్, మెదడు అన్నీ sync అయిపోతాయి. లక్షణాలకు చికిత్స చేయడం ఆపి, లయను సరిచేయాలి.

డాక్టర్ (మేజ్) రాజేష్ భరద్వాజ్ మాట్లాడుతూ, సాయంత్రం 7 గంటలలోపు తిని, రాత్రి 10 గంటలకు నిద్రపోవాలనే universal rule ఏదీ లేదు. ముఖ్యమైనది clock కాదు, consistency. రెగ్యులర్ meal times మరియు స్థిరమైన sleep schedule వల్ల circadian health improve అవుతుంది. దీర్ఘకాలికంగా rhythm disrupt అయితే metabolism దెబ్బతినడం, ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, నిద్ర నాణ్యత తగ్గడం, ఇమ్యూనిటీ బలహీనపడటం లాంటి సమస్యలు వస్తాయి. అలాగే ఆందోళన, డిప్రెషన్, హార్ట్ డిసీజెస్ risk పెరుగుతుంది.

మీరు మీ circadian rhythm ను reset చేయడానికి కొన్ని simple habits follow చేస్తే సరిపోతుంది. మొదటగా, వారాంతాల్లో కూడా అదే సమయంలో పడుకోండి, లేవండి. రెండవది, నిద్రపోయే కనీసం 2-3 గంటల ముందు dinner finish చేయండి. మూడవది, ఉదయం సూర్యుడి వెలుగులో కొంత సమయం గడపండి మరియు రాత్రి స్క్రీన్‌లను reduce చేయండి. ఈ మూడు చిన్న మార్పులతో మీ శరీరం మీతో పోరాడటం మానేస్తుంది. ఏదైనా దినచర్యను start చేసే ముందు మీ ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి. ఈ కథనం పబ్లిక్ డొమైన్ మరియు నిపుణుల సమాచారం ఆధారంగా రూపొందించబడింది.

Share your love