ఆకివీడు రామాలయం నిర్మాణానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో భారీ చర్చకు దారితీసిన ఈ కేసులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గంలోని పెదపాడు గ్రామంలో రామాలయాన్ని నిర్మించుకునే అవకాశం దక్కింది. జిల్లా కలెక్టర్ ఇచ్చిన NOC ను సుప్రీం కోర్టు సమర్థించడంతో, ఈ వివాదానికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పడింది.
Akiveedu Ramalayam Supreme Court Order
టీడీపీ నేత, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు (ట్రిపులార్) పురాతన రామాలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్లో రామనవమి సందర్భంగా ఆయన అక్కడ పూజలు చేయడంతో తీవ్ర వివాదం మొదలైంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు ఆ ప్రాంతంలో గొంతేరమ్మ ఆలయం ఉందని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో రాజకీయాలు వేడెక్కాయి, పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు.
హైకోర్టు ఇప్పటికే రామాలయం ఉన్న స్థలం ప్రభుత్వానిదేనని, నిర్మాణానికి అభ్యంతరం లేదని తీర్పు ఇచ్చింది. దీన్ని పిటిషనర్లు సుప్రీంలో సవాల్ చేయగా, తాజా విచారణలో సుప్రీం కోర్టు కూడా అనుమతిని కొనసాగించింది. విగ్రహానికి పూజలు చేస్తూ ఆలయ నిర్మాణాన్ని ఓకే చేయడంతో రఘురామరాజు సంతోషం వ్యక్తం చేశారు.
కోటి రూపాయలతో రామాలయాన్ని నిర్మించేందుకు రఘురామరాజు crowd funding చేశారు. ఇప్పటికే కృష్ణ శిలలతో నిర్మాణం మొదలైంది, కానీ ఆందోళనల వల్ల పనులు మందగించాయి. సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక నిర్మాణం వేగంగా జరిగే అవకాశం ఉంది. ఏదైనా ఇతర అభ్యంతరాలుంటే విడిగా పిటిషన్ వేసుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది.





