Hero: డూప్ లేకుండా సినిమాలు.. 119 కుట్లు వేయించుకున్న హీరో..!

The Hero who made films without dupes

Hero: సినిమా ఇండస్ట్రీలో యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా చాలామంది హీరోలు నటించరు. స్టంట్ లు చేయాలి అంటే కచ్చితంగా డూప్ ఉండాల్సిందే.కానీ కొంతమంది హీరోలు ఇందుకు విరుద్ధంగా ఉంటారు.డూప్ లేకుండానే సినిమాలు తీసేస్తూ ఉంటారు. కానీ అలా డూప్ లేకుండా సినిమాలు చేయడం వల్ల వారికి గాయాలు కూడా అవుతాయి.

The Hero who made films without dupes

అలా ఈ హీరో కూడా ఇప్పటివరకు చేసిన ఏ ఒక్క సినిమాలో కూడా డూప్ లేకుండా నటించి చాలాసార్లు హాస్పిటల్లో పడ్డారట.మరి ఇంతకీ ఆ హీరో ఎవరు అనేది చూస్తే కోలీవుడ్ నటుడు విశాల్.. ఈయన తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ సంచలన విషయాన్ని బయట పెట్టారు. (Hero)

Also Read: K Ramp Review: కిరణ్ అబ్బవరం “K-RAMP” మూవీ రివ్యూ!!

నేను ఇప్పటి వరకు నటించిన ఏ సినిమాలో కూడా డూప్ ని పెట్టుకోలేదు. స్వయంగా స్టంట్ లు చేయడం నాకు ఇష్టం. ఇలా స్వయంగా నేనే చేయడం వల్ల చాలా సార్లు గాయాలపాలై హాస్పిటల్ లో పడ్డాను. అలా ఇప్పటివరకు నా బాడికి 119 కుట్లు పడ్డాయి.అయినా కూడా నా సినిమా కోసం నేను డూప్ ని తీసుకోను అంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు.

The Hero who made films without dupes

అలా విశాల్ తన సినిమాలకి తానే స్టంట్ లు చేసుకోవడం వల్ల చాలాసార్లు హాస్పిటల్ పాలయ్యారు. ఇక ప్రస్తుతం విశాల్ మకుటం అనే సినిమాలో నటిస్తున్నారు. 50 ఏళ్లకు దగ్గర పడుతున్న విశాల్ ఈ మధ్యనే తాను పెళ్లి చేసుకోబోయే హీరోయిన్ సాయి ధన్సిక ని పరిచయం చేసారు. ఇక త్వరలోనే వీరి పెళ్లి జరగబోతోంది.(Hero)

Share your love