

Aroori Ramesh: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన ఆరూరి రమేష్, గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ కండువా కప్పి ఆహ్వానించారు. అయితే గులాబీ పార్టీలో చేరిన ఆరూరి రమేష్, కడియం శ్రీహరిని టార్గెట్ చేశారు. Aroori Ramesh
Aroori Ramesh slams kadiyam srihari
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో గులాబీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోయేలా కడియం శ్రీహరి కుట్రలు పన్నాడని సంచలన ఆరోపణలు చేశారు ఆరూరి రమేష్. ఎన్నికల కంటే ముందే రేవంత్ రెడ్డి తో కుమ్మక్కొయ్యాడని.. కాంగ్రెస్ కోవర్టుగా మారిపోయాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆరూరి రమేష్. అందుకే వరంగల్ జిల్లాలో తనతో పాటు చాలామంది గులాబీ పార్టీ నేతలు ఓడిపోయారని గుర్తు చేశారు. Aroori Ramesh
Also Read: Deputy CM Ajit Pawar : అజిత్ పవార్ విమాన ప్రమాదంపై సంచలన వీడియో
వరంగల్ ఎంపీ టికెట్ తాను ఆశించింది నిజమేనని.. కానీ కడియం శ్రీహరి కూతురుకు టికెట్ ఇవ్వడంతో గులాబీ పార్టీని వీడినట్లు తప్పు ఒప్పుకున్నారు ఆరూరి రమేష్. అయితే ఇప్పుడు ఆ తప్పు తెలిసి మళ్ళీ సొంత గూటికి వచ్చానని వెల్లడించారు. చిన్నప్పుడు పిల్లాడు తప్పిపోయి ఇంటికి వస్తే.. ఆ ఇంట్లో సంబరం ఎలా ఉంటుందో ఇప్పుడు గులాబీ పార్టీలో అదే సంబరం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. Aroori Ramesh
Also Read: Ajit Pawar-plane crash: విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి







