

RAJ GOPAL REDDY : అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పై రాజ్ గోపాల్ రెడ్డి సెన్షేషన్ కామెంట్స్ చేశారు. మరో పది సంవత్సరాల పాటు నేను సీఎం అని రేవంత్ రెడ్డి ప్రకటన పై మంత్రులు స్పందించకపోవడ దారుణం అన్నారు. RAJ GOPAL REDDY
Comments by MLA Komati Reddy Raj Gopal Reddy on CM Revanth Reddy
రాష్ట్రంలో నడుస్తున్నది 140 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీనా..? లేక రేవంత్ రెడ్డి పార్టీనా..? అని ప్రశ్నించారు. టీడీపీ నుంచి వచ్చిన గుత్తా సుఖేందర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి వంటి నేతల మాటలకు ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి అన్ని మంత్రిత్వ శాఖలు తన దగ్గరే ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు.
Also Read : Sridhar Rao : ఈనాడు ఉద్యోగికి చంద్రబాబు బంపర్ ఆఫర్ ?
దేశ చరిత్రలో ఏ సీఎం అయినా ఇన్ని మంత్రిత్వ శాఖలు తన దగ్గర పెట్టుకున్నారా..? ఈ రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి నిజాయితీగా పాలన చేశాడా..? అవినీతి లేకుండా పరిపాలన జరిగిందా..? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎంత వరకు నెరవేర్చారు. కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు నిజాయితీగా పని చేస్తున్నారా..? సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రశ్నలకు ప్రజలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే నే సీఎం పై సంచలన వ్యాఖ్యలు మాట్లాడటం ఇప్పుడు సంచలనంగా మారింది.
Also Read : Sandhya Case : ‘సంధ్య’ కేసులో ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చిన కోర్టు







