

Gudivada Amarnath: చంద్రబాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వంద శాతం కరెక్ట్ అంటూ మాజీ మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ఎన్నడూ అబద్దాలు మాట్లాడలేదని గుర్తు చేశారు. కాబట్టే ఆయన అంత పెద్ద నేతగా ఎదిగారని వెల్లడించారు మాజీ మంత్రి అమర్నాథ్. Gudivada Amarnath
Gudivada Amarnath comments on kcr chandrababu
కేసీఆర్ వ్యాఖ్యలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానని వెల్లడించారు. ప్రభుత్వంలో ఉండి ప్రజల కోసం ఆలోచించాలని చురకలు అంటించారు. కొడుకు, కుటుంబం కోసం కాదంటూ సెటైర్లు పేల్చారు వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. Gudivada Amarnath
Also Read: HYDRA Ranganath: వివాదంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ? గన్‌మ్యాన్ ఆత్మ**త్యాయత్నం
అటు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 20 లక్షల కోట్ల పెట్టుబడులు అని వంట మనుషులతో ఫేక్ ఏంవోయూలు చేయించాడని బాంబ్ పేల్చారు కేసీఆర్. రేవంత్ రెడ్డి ఫేక్ ఏంవోయూలకు ఆజ్యుడు వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడంటూ ఎద్దేవా చేశారు
ఫేక్ ఏంవోయూతో పెట్టుబడులు వస్తాయంటే ఆంధ్రాలో ఇప్పటి వరకే రూ.20 లక్షల కోట్లు రావాలని నిలదీశారు కేసీఆర్. ఇప్పుడు ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ, చంద్రబాబును ట్రోల్ చేస్తోంది వైసీపీ. Gudivada Amarnath
Also Read: Jagan-Sharmila: జగన్ తో కలిసిపోయిన వైఎస్ షర్మిల..షాకింగ్ ట్వీట్ వైరల్ ?







