

Jagtial Congress: జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో మరోసారి ముసలం నేలకొంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల మాజీ ఎమ్మెల్యే వర్సెస్ ప్రస్తుత ఎమ్మెల్యే మధ్య వార్ కొనసాగుతోంది. గులాబీ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన డాక్టర్ సంజయ్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఏకమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో 50 సీట్లు ఉంటే సంజయ్ వర్గానికి ఎక్కువగా టికెట్లు వచ్చినట్లు… జీవన్ రెడ్డి వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Jagtial Congress
Jagtial Congress Jeevan Reddy vs Sanjay in Jagityal
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో 50 సీట్లు ఉంటే… ఫిరాయించి పార్టీలోకి వచ్చిన సంజయ్ వర్గానికి 30 సీట్లు ఇచ్చారట. అటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి వర్గానికి 20 సీట్లు కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది. దీంతో జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించిన అసలు సీసలు కాంగ్రెస్ వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Jagtial Congress
Also Read: Ambati Rambabu: అంబటి రాంబాబు ఇష్యూ.. హైదరాబాద్లో టీడీపీ కార్యకర్తల నిరసన
లా***భాష మాట్లాడుతూ గులాబీ పార్టీ రెబల్ ఎమ్మెల్యే సంజయ్ ను బండ బూతులు తిడుతున్నారు. కనీసం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోని వాళ్లకు టికెట్లు ఎలా ఇస్తారని నిలదీస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ముసలం నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. Jagtial Congress
Also Read: Ambati Rambabu: అంబటి రాంబాబు ఇష్యూ.. హైదరాబాద్లో టీడీపీ కార్యకర్తల నిరసన







