Kanaka Durga Temple: విజయవాడ క‌న‌క‌దుర్గ‌మ్మ గుడిలో అపచారం!

Kanaka Durga Temple : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత దేవాలయాలలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. తిరుమలతో పాటు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కూడా అపచారాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో మరో అపచారం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. Kanaka Durga Temple

Kanaka Durga Temple news update

శ్రీ చక్రార్చన పాలలో పురుగు వచ్చిందని ఆరోపణలు తెరపైకి వచ్చాయి. దీంతో అలర్ట్ అయిన ఆలయ కమిటీ దీనిపై విచారణకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే పురుగు వచ్చిందన్న ఆరోపణల పై విచారణకు ఈవో శినా నాయక్ కమిటీ కూడా వేయడం జరిగింది. ఈ కమిటీలో స్థానాచార్య, ఇద్దరు వైదిక కమిటీ సభ్యులు ఉన్నారు. Kanaka Durga Temple

Also Read: komatireddy venkat reddy: నాకింత విషమిచ్చి చంపేయండి..లేడీ ఐఏఎస్ వార్త‌ల‌పై సీరియ‌స్‌?

ఈ సందర్భంగా విచారణ చేసిన కమిటీ షాకింగ్ నిజాలను బయటపెట్టింది. శ్రీ చక్రార్చన పాలలో పురుగు రావడానికి అర్చకుడి బాధ్యత రాహిత్యమే కారణం అంటూ కమిటీ వెల్లడించింది. దీంతో అర్చకుడికి పై చర్యలు తీసుకోవాలని ఈవోకు కమిటీ నివేదిక ఇవ్వడం జరిగింది. దీంతో ఆలయ అర్చకుడి పై వేటు పడనుంది. Kanaka Durga Temple

Also Read: Teenmaar Mallanna: తీన్మార్‌ మల్లన్న నుంచి చేజారిపోయిన Q News యూట్యూబ్ ఛానల్ ?

Share your love