Nagarjuna: ఫ్రీగా వస్తుందని సినిమా చూసేయకండి.. పర్సనల్ డేటా మొత్తం చోరీ..!

Nagarjuna Comments On Piracy
Nagarjuna Comments On Piracy

Nagarjuna: తాజాగా పైరసీ కింగ్ ఐ బొమ్మ సైట్ నిర్వాహకుడు ఇమ్మాడి రవిని పోలీసులు అరెస్టు చేసి సంచలన విషయాలు బయటకు లాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులతో కలిసి కమాండ్ కంట్రోల్ రూమ్ లో సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు.ఈ ప్రెస్ మీట్ లో రాజమౌళి, నాగార్జున, చిరంజీవి,దిల్ రాజు, సురేష్ బాబు, నాని లు పాల్గొన్నారు.

Nagarjuna Comments On Piracy

అయితే ఈ ప్రెస్ మీట్ లో నాగార్జున మాట్లాడుతూ.. పైరసీని అరికట్టడం కోసం తెలంగాణ పోలీసులు చేసిన కృషి అభినందనీయం. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఇమ్మాడి రవిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశాక చెన్నై నుండి నా ఫ్రెండ్ ఒకరు కాల్ చేసి మేము చేయని పని మీరు చేశారు గ్రేట్ అంటూ మెచ్చుకున్నారు. పైరసీ వెనుక పెద్ద రాకెట్ నడుస్తుంది. (Nagarjuna)

Also Read: IBomma Ravi: ఐ బొమ్మ రవి బ్యాగ్రౌండ్ తెలిస్తే మైండ్ బ్లాక్.. గతంలో అలాంటి పని చేసేవారా.?

అంతర్జాతీయ మూట ఉంది. ఫ్రీగా వస్తుంది కదా అని సినిమాలు చూసేయకండి. ఐ బొమ్మ సైట్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల డాటా మొత్తం వాళ్ల దగ్గర ఉంది. ఫ్రీగా సినిమాలు చూపించాలి అనేది వారి ఉద్దేశం కాదు. మీ నుండి వాళ్లు వేల కోట్లు సంపాదిస్తున్నారు.

Nagarjuna Comments On Piracy

ఫ్రీగా సినిమా చూస్తున్నామని కాకుండా దాని వెనుక ఏం మోసం ఉంది అనేది గ్రహించండి అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు. అంతేకాదు తమ కుటుంబంలోనూ దాదాపు రెండు రోజులపాటు ఒకరిని నిర్బంధించారని పోలీసులకు సమాచారం అందించే లోపు తప్పించుకున్నారు అంటూ డిజిటల్ అరెస్టు గురించి నాగార్జున చెప్పుకొచ్చారు.(Nagarjuna)

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu