
Naini Coal Mines Tender: నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పాలనాపరమైన కారణాలతో టెండర్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సింగరేణి యాజమాన్యం.. అందరికీ షాక్ ఇచ్చింది. నైనీ కోల్ మైన్స్ టెండర్స్ విషయంలో తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఇటీవలే టెండర్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. రాజకీయాలను కుదిపేశారు. Naini Coal Mines Tender
Naini Coal Mines Tender case update
ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభం కావాల్సిన బిడ్స్..ఈ నిర్ణయం తో ఆగిపోయాయి. నైనీ టెండర్ల విషయంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ ఎంటర్ అయిందట. ఈ తరుణంలోనే సింగరేణి పాలకమండలిని నిలదీసిందని అంటున్నారు. సంస్థ విధించిన నిబంధనలపై పాలకమండలి ఎందుకు చర్చించలేదని సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ కడిగిపారేసిందట కేంద్రం.
Naini Coal Mines Tender
Also Read: Ponnam Prabhakar: మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నిరసన సెగ
చర్చించి ఉంటే టెండర్ల విషయంలో అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? అని నిలదీశారని అంటున్నారు. టెండర్ వెయ్యాలనుకున్న కంపెనీలకు ఎందుకు సైట్ విజిట్ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదంటూ కడిగిపారేసిందట కేంద్రం. అయితే టెండర్ల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని వివరించారు. నిబంధనలు, టెండర్లపై పాలక మండలిలో చర్చించి మరోసారి నిర్ణయం తీసుకుంటామని సింగరేణి అధికారులు స్పష్టం చేశారట. Naini Coal Mines Tender
Also Read: Telangana: దావోస్‌లో సీఎం రమేష్, గ్రీన్‌కో..ఫోటో వైరల్ ?




















