Telangana: తెలంగాణ చేనేత సహకార సంఘానికి రేవంత్ ప్రభుత్వం షాక్

Telangana
Telangana

Telangana: తెలంగాణ చేనేత సహకార సంఘానికి రేవంత్ ప్రభుత్వం షాక్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం అందుతోంది.
ప్రభుత్వ పాఠశాలల యూనిఫాం ఆర్డర్లు రద్దు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇకపై ప్రైవేటు సంస్థలకు ఆర్డర్ ఇస్తామని టెస్కోకు విద్యాశాఖ లేఖ రాసింది. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు తయారీ చేయాల్సిన యూనిఫాంలకు సంబంధించిన రూ.105 కోట్ల ఆర్డర్ రద్దు చేస్తూ టెస్కోకు షాకిచ్చింది తెలంగాణ విద్యాశాఖ. Telangana

Revanth government shocks Telangana Handloom Cooperative Society

ఇప్పటికే సంక్షేమ శాఖ రూ.200 కోట్ల విలువైన దుప్పట్ల తయారీ ఆర్డర్ ఇవ్వకపోవడంపై టెస్కో ఆందోళన వ్య‌క్తం చేస్తోంది. గత నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వ విద్యాశాఖ, సంక్షేమ శాఖల పరిధిలోని దుస్తులను, దుప్పట్లను సరఫరా చేస్తోంది టెస్కో. Telangana

Also Read: Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు

అయితే ఇకపై టెండర్ల ద్వారా వచ్చిన ప్రైవేటు సంస్థలకు ఆర్డర్ ఇస్తామని సంక్షేమ సంఘాలు తెలిపిన తరుణంలో, విద్యాశాఖ ఆర్డర్ రద్దు చేయడంతో తీవ్ర అయోమయంలో పడింది. విద్యాశాఖలోని ఉన్నతాధికారులను సంప్రదించారు. తాము కూడా టెండర్ విధానంలోకి వెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరణ ఇచ్చింది. Telangana

Also Read: RS Praveen Kumar: రేవంత్ రెడ్డి అనేవాడు చంద్రబాబుకు ప్రాక్సీ ముఖ్యమంత్రి

Share your love