
Samantha: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సమంత గురించి తాజాగా ఓ సంచలన విషయాన్ని బయట పెట్టారు అసిస్టెంట్ డైరెక్టర్.అదేంటంటే రీసెంట్గా సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన తెలుసు కదా మూవీ అందరూ చూసే ఉంటారు. అయితే ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి,రాశి ఖన్నాలు హీరోయిన్లుగా నటించారు.అలా మొట్టమొదటిసారి ఈ సినిమాకి, హెయిర్ స్టైలిస్ట్,కాస్ట్యూమ్ డిజైనర్ అయినటువంటి నీరజ కోన దర్శకురాలిగా మారి డైరెక్షన్ చేసింది.
The assistant director who exposed Samantha cheating
అయితే ఈ సినిమాపై సంచలన ఆరోపణలు చేశారు అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా కథ నాదని,ఈ సినిమాని మొదట రష్మిక లేదా సమంతతో తీయాలి అనుకున్నానని,నితిన్, నానీలతో పాటు కొంతమంది ప్రొడ్యూసర్లకు కూడా ఈ సినిమా గురించి స్టోరీ చెప్పానని దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇవే అంటూ సంచలన విషయాన్ని బయటపెట్టారు అసిస్టెంట్ డైరెక్టర్. (Samantha)
Also Read: Mega Heroes: ఆకాశంలో నుండి ఊడి పడ్డారా.. మెగా హీరోల పరువు తీసిన ఐ బొమ్మ రవి తండ్రి.!
అంతేకాదు ఇది ఫిమేల్ సెంట్రిక్ సినిమా అని,కానీ ఈ సినిమా కథ లీక్ అవ్వడం వల్ల దాన్ని నీరజ కోన మెయిల్ సెంట్రిక్ మూవీ గా చేసి ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్, నైట్రోజన్ అనే పదాలు చేర్చి సినిమా కథ మొత్తాన్ని బ్రష్టు పట్టించేసింది అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

అంతే కాదు ఈ సినిమా కథని సమంత నే తన దగ్గర చాలా సంవత్సరాలుగా హెయిర్ స్టైలిస్ట్ గా చేస్తున్న నీరజ కోనకు లీక్ చేసింది అంటూ అసిస్టెంట్ డైరెక్టర్ సంచలన ఆరోపణ చేశారు. మరి అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన ఆరోపణలో ఉన్న నిజమెంత..నిజంగానే సమంత నీరజ కోనకు కథ లీక్ చేసిందా అనేది తెలియాల్సి ఉంది.(Samantha)






