
AP budget : ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. 2026-27 వార్షిక బడ్జెట్ ఆమోదించనున్న మంత్రివర్గం.. ఈ మేరకు సమావేశం కానుంది. ఈ సారి సుమారు రూ 3.40 లక్షలతో ఏపీ బడ్జెట్ రూపొందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. AP budget
This time, the AP budget is around Rs 3.40 lakh
ఇక ఇవాళ ఉదయం 11:40 గంటలకు అసెంబ్లీలో ఏపీ వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడతారు. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు మంత్రి పయ్యావుల కేశవ్. అటు మండలిలో బడ్జెట్ ను మంత్రి కొల్లు రవీంద్ర ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ అనంతరం ఉభయసభలు వాయిదా పడతాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. AP budget
Also Read: KTR: సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలో బీఆర్ఎస్ విజయకేతనం
జగన్మోహన్ రెడ్డికి శవరాజకీయాలు అంటే ఇష్టం అన్నారు. అందుకే వైసీపీ ఎమ్మెల్సీ కారు డిక్కీలో శవం వేసుకుంటే బుజం తట్టాడని వెల్లడించారు. ఆయన పర్యటనలో ఎవరైనా చనిపోతే కనీసం పరామర్శించబోడని వివరించారు. వేరే పార్టీ నాయకుల్ని బూతులు తిట్టిన వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శిస్తాడన్నారు. జగన్ ని మర్చంట్ ఆఫ్ డెత్ అంటూ అభివర్ణించారు సోమిరెడ్డి. AP budget
Also Read: Telangana: రేవంత్ స్కెచ్..తెలంగాణలో ఆ ఎన్నికల నోటిఫికేషన్ ?

