
Walking: వాకింగ్ చాలామంది చేస్తారు వాకింగ్ చేయడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నేటి కాలంలో కలుషితమైన ఆహారం కారణంగా చాలామంది అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో చాలామంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యంగా ఉండడానికి చాలామంది ఎన్నో రకాల వ్యాయామాలు చేస్తున్నారు. అందులో వాకింగ్ ఒకటి. చాలామంది ఉదయం లేచిన వెంటనే లేదా సాయంత్రం సమయంలో వీలు చూసుకుని వాకింగ్ చేస్తూ ఉంటారు. వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక చాలామంది వాకింగ్ చేసే సమయంలో పరుగులు పెడుతూ ఉంటారు కొంతమంది నెమ్మదిగా నడుస్తూ ఉంటారు. Walking
Walking Trim your waistline, improve your health
అయితే నడిచే సమయంలో కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాకింగ్ చేసే సమయంలో నెమ్మదిగా నడిస్తే శరీరంలో క్యాలరీలు కరగవు. వాకింగ్ చేసే సమయంలో వేగంగా నడిస్తేనే గుండె కండరాలు బలోపేతం అవుతాయి. అంతేకాకుండా చాలామంది ఫోన్ చూసుకుంటూ, ఫోన్లలో మాట్లాడుతూ వాకింగ్ చేస్తారు. అలా చేయడం వల్ల శరీరంలో క్యాలరీలు ఏమాత్రం కరిగిపోవు. ఫోన్ చూస్తూ వాకింగ్ చేయడం వల్ల మెడ నొప్పి, వెన్ను నొప్పి లాంటి సమస్యలు వస్తాయి కంటి చూపు మందగిస్తుంది. ఫోన్ చూస్తూ వాకింగ్ చేయడం వల్ల కంటి ఆరోగ్య పనితీరు దెబ్బతింటుంది. వాకింగ్ చేసే సమయంలో సౌకర్యవంతంగా ఉండే దుస్తులు, బూట్లు ధరించి వాకింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల వారికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. నడిచే సమయంలో దుస్తులు అడ్డుగా రావు సౌకర్యవంతంగా ఫాస్ట్ గా నడవవచ్చు. Walking
Also Read: KCR: జగన్ తో పొంగులేటి సమావేశం… కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం పక్కనా?
సౌకర్యవంతంగా ఉండే బూట్లను మాత్రమే ధరించాలి అలా చేయడం వల్ల అడుగులు నేలకు బలంగా తాకుతాయి. దానివల్ల కండరాలు బలోపేతం అవుతాయి. వాకింగ్ చేసే సమయంలో మరికొంతమంది కాళ్లకు బూట్లు, చెప్పులు ధరించకుండానే వాకింగ్ చేస్తారు. అలా చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. కాళ్లకు చెప్పులు, బూట్లు లేకుండా వాకింగ్ చేయడం వల్ల నేల కాళ్లకు బలంగా తాకుతుంది దానివల్ల కాలికి స్పర్శ బాగా తాకుతుంది. కాళ్లకు నేల బలంగా తాకిన సమయంలో శరీరంలో రక్తప్రసరణ వేగవంతం అవుతుంది కండరాల కదలిక చురుగ్గా ఉంటుంది. కాళ్లకు ఏమి వేసుకోకుండానే వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇక మరి కొంతమంది కాళ్లకు ఏమైనా అంటుకుంటాయని భయంతో బూట్లు ధరిస్తారు. Walking
Also Read: Asia Cup 2025: ఆసియా కప్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్?




















