Shubman Gill: రెండో టెస్టుకు గిల్ దూరం.. ముంబైకి త‌ర‌లింపు..మ‌ళ్లీ ఏం జ‌రిగిందంటే ?

Shubman Gill: టీమిండియా కెప్టెన్ గిల్ ను ముంబైకి తరలిస్తున్నారు. ఇటీవల మెడ నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిపాలైన గిల్, గౌహతి నుంచి నేరుగా ముంబై కి వెళ్ళాడు. వైద్య బృందం సమక్షంలో టీమిండియా కెప్టెన్ గిల్ ను ముంబైకి తరలించారు. దీంతో టీమిండి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. Shubman Gill

Shubman Gill has been released from Indian Test squad

మరోసారి గిల్ కు గాయమైందా ? ఇంకా ఏమైనా సమస్యలు వచ్చాయా? అంటూ చర్చించుకుంటున్నారు. మెడ నొప్పితో బాధపడుతున్న గిల్, ఇప్పటికే దక్షిణాఫ్రికాతో జరగాల్సిన రెండో టెస్టుకు దూరమయ్యాడు. కానీ ఈడెన్ గార్డెన్స్ నుంచి గౌహతికి టీమిండియా జట్టుతోనే వచ్చాడు గిల్. మళ్లీ గౌహతి నుంచి ముంబైకి తరలించారు. Shubman Gill

Also Read: YS Jagan: హైద‌రాబాద్ లో జ‌గ‌న్ ఎంట్రీ..రప్పా రప్పా పోస్ట‌ర్ల క‌ల‌క‌లం

ఇవాళ గిల్ కు ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించబోతున్నారట. ఇందులో ఫెయిల్ కావడంతో జట్టు నుంచి అతన్ని రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే ముంబైకి గిల్ ను తరలించారు. ఇక ముంబైలో వైద్య నిపుణుల పర్యవేక్షణలో దాదాపు మూడు రోజులపాటు గిల్ చికిత్స తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అప్పుడు కూడా అతడు కోరుకుంటే వన్డే సిరీస్ ఆడుతాడు. లేకపోతే ఆ సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. Shubman Gill

Also Read: KCR: “గద్ద ముక్కు” అంటూ కేసీఆర్ పై రెచ్చిపోయిన ఏపీ మంత్రి.. BRS అదిరిపోయే…