వినోదం, సందేశం కలిసిన కథతో వస్తున్న”పెళ్లిలో పెళ్లి”

గౌరి ఫిలింస్ తో కలిసి సుఖకర్త ఫిలింస్ ప్రొడక్షన్ నెం.1గా “పెళ్లిలో పెళ్లి” చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో శివ సాయిరిషి, సంస్కృతి గోరే, విష్ణు ప్రియ, ఉమా మహేశ్వరరావు, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గణేష్ కోలి నిర్మిస్తున్న “పెళ్లిలో పెళ్లి” సినిమాకు శ్రీకాంత్ సంబరం దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. గురువారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ తో పాటు బ్యానర్ లాంఛ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో

ప్రొడ్యూసర్ గణేష్ కోలి మాట్లాడుతూ – మేము మహారాష్ట్రలో ఉంటాం కానీ తెలుగు సినిమాలు చూస్తుంటాం. తెలుగు భాషను అభిమానిస్తాం. తెలుగులో తెరకెక్కే కుటుంబ కథా చిత్రాలంటే చాలా ఇష్టపడతాం. సినిమా మేకింగ్ మీద అభిరుచితో “పెళ్లిలో పెళ్లి” చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాను. ఈ సినిమా రూపకల్పన బాధ్యత మొత్తం మా దర్శకుడు శ్రీకాంత్ చూసుకున్నారు. ఈ కథలో ట్విస్ట్ ఏంటనేది ఇంకా నాకు కూడా రివీల్ చేయలేదు. నేనూ మీతో పాటే థియేటర్స్ లో చూడబోతున్నా.అన్నారు.

డైరెక్టర్ శ్రీకాంత్ సంబరం మాట్లాడుతూ – షోలాపూర్ కు తెలుగు వాళ్లు వెళ్లి వందేళ్లవుతోంది. కానీ అక్కడి నుంచి ఒక తెలుగు సినిమాను చేసింది మాత్రమే మేమే. నేను గణేష్ మండపం దగ్గర ప్రొడ్యూసర్ గణేష్ కోలి గారిని కలిశాను. ఇప్పుడు పోస్టర్ లాంఛ్ ఈవెంట్ చూస్తుంటే ఆ వినాయకుడే మమ్మల్ని ఇక్కడిదాకా నడిపించాడని అనిపిస్తోంది. భరణి గారు మా మూవీలో కీ రోల్ చేశారు. ఈ చిత్రం మా అందరికీ ఒక ఎమోషనల్ జర్నీ. ఆ ఎమోషన్ ప్రేక్షకులకు కూడా రీచ్ అవుతుందని నమ్ముతున్నాం. అన్నారు.

Share your love