మళ్లీశ్వరి సెంటిమెంట్ ఫాలో అవుతున్నారా?

వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన మళ్లీశ్వరి సినిమా సూపర్ హిట్ గా ప్రేక్షకుల్ని అలరించింది. ఈ చిత్రానికి విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించినా, అందరి చూపు అప్పటి స్టార్ రైటర్ త్రివిక్రమ్ మీదే ఉండేది. త్రివిక్రమ్ కథా మాటలే ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేసేవి. మళ్లీశ్వరిని వైజాగ్ నగరం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన త్రివిక్రమ్ వెంకటేష్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు.

ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించనుంది. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబో చిత్రానికి వెంకటరమణ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ వర్క్స్ లో ఉన్న ఈ చిత్రానికి వైజాగ్ బ్యాక్ డ్రాప్ నే తీసుకున్నారట త్రివిక్రమ్. మళ్లీశ్వరి సెంటిమెంట్ ను మరోసారి ఆయన ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణీ వసంత్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మధ్యతరగతి వ్యక్తి పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.

Share your love