నాగవంశీకి డబ్బులు ఇప్పించిన ఎన్టీఆర్ ?

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన వార్ 2 మూవీని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసిన నిర్మాత నాగవంశీ ఆర్థికంగా నష్టాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల రైట్స్ ను నాగవంశీ 80 కోట్లకు తీసుకున్నాడు. దీంట్లో సగం కూడా రికవరీ కాలేదనే టాక్ వినిపిస్తోంది. నాగవంశీకి వార్ 2 విషయంలో చాలా నష్టం వచ్చింది. అయితే.. ఎన్టీఆర్ వార్ 2 నిర్మాతలతో మాట్లాడి నాగవంశీకి 22 కోట్లు వెనక్కి ఇప్పించారని ట్రేడ్ వర్గాల సమాచారం.

వార్ 2 సినిమా నాగవంశీకి భారీగా నస్టాలు తీసుకువచ్చింది. 22 కోట్లు వెనక్కి ఇస్తే.. కొంచెం రికవరీ అయినట్టే. ప్రస్తుతం నాగవంశీ తన నుంచి రానున్న మాస్ జాతర సినిమా పై దృష్టి పెడుతున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే.. నస్టాల నుంచి కొంచెం బయటపడచ్చు. అందుకనే ఈ సినిమాని ఆగష్టు 27న రిలీజ్ చేయాలి అనుకున్నప్పటికీ..సెప్టెంబర్ 12న రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వార్ 2 పోయినంత మాత్రాన తన పని అయిపోలేదని అంటున్నారు నాగవంశీ. ఇంకో 15 ఏళ్లు సినిమాలు చేస్తానని చెబుతున్నారు.

Share your love