పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే సినిమా స్పిరిట్. టీ సిరీస్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో ఓ కీలక పాత్ర చేయించాలని సందీప్ రెడ్డి వంగ ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది.
యానిమల్ మూవీలో అనిల్ కపూర్ పాత్ర ఎలాగైతే ఉందో..అదే స్థాయిలో స్పిరిట్ లో కూడా ఓ కీలక పాత్ర ఉందట. ఈ పాత్రను మెగాస్టార్ చిరంజీవితో చేయిస్తే.. ఈ మూవీకి మరింత క్రేజ్ పెరగడం ఖాయం. ఇంకా చెప్పాలంటే బాక్సాఫీస్ షేక్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఇది వైరల్ అయ్యింది. దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.





