Anushka: అనుష్క జీవితాన్ని సంకనాకించేసిన సినిమా.!

Anushka Shocking comments on that movie

Anushka: అనుష్క ప్రస్తుతం ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్లలో ఈమె మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇండస్ట్రీలోకి ఈమె తర్వాత ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లిపోయారు. కానీ అనుష్క మాత్రం అన్ని రకాల పాత్రలు చేసుకుంటూ తనకు ఎదురులేదని అనిపించుకుంటుంది. అన్ని బాగానే ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు అనుష్క ఇంకా పెళ్లి విషయంలో మాత్రం వెనకడుగు వేస్తోంది.

Anushka Shocking comments on that movie

వివాహం విషయంలో వెనకడుగు తప్ప ఇక ఏ విషయంలో అనుష్క తగ్గేదే లేదంటూ దూసుకుపోతోంది. అలాంటి అనుష్క నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. వచ్చిన అనతి కాలంలోనే మంచి గుర్తింపు సాధించింది. ఆ తర్వాత అరుంధతి సినిమా చేసి తనకు ఎదురు లేదు అనిపించుకుంది ఈ సినిమా తర్వాత అనుష్క కెరీర్ పూర్తిగా మారిపోయింది. అయితే అలాంటి అనుష్క తన కెరియర్లో ఆ ఒక్క హీరోతో సినిమా చేసి తప్పు చేశానని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ హీరో ఎవరు వివరాలు చూద్దాం.. (Anushka)

Also Read: Kajal: కాజల్ ని అర్ధరాత్రి పిలిచినా నా ఇంటికి వస్తుంది.. దర్శకుడు షాకింగ్ కామెంట్స్.!

అనుష్క కెరియర్ లో చేసిన సినిమాలన్నింటిలో చాలావరకు హిట్ సినిమాలే ఉన్నాయి.. అందులో కొన్ని కాస్త ఫ్లాప్ అయినా కానీ అంతగా పెద్ద ఎఫెక్ట్ ఏమీ పడలేదు. కానీ బాలకృష్ణతో చేసిన ఒక్క మగాడు సినిమా మాత్రం దారుణంగా ఫ్లాప్ అయింది. 2008లో సంక్రాంతి కానుకగా వచ్చినటువంటి ఈ చిత్రం అనుష్క కెరియర్ లోనే కాకుండా బాలకృష్ణ కెరియర్ లో కూడా అది పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.

Anushka Shocking comments on that movie

ఈ సినిమాలో అనుష్క క్యారెక్టర్ కు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం దీనికి తోడు ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉండడం అనుష్కకు మరింత ఇబ్బంది కలిగించేలా చేసింది. ఇందులో తన క్యారెక్టర్ ఏంటో పూర్తిగా తెలుసుకోకుండానే సైన్ చేశానని, ఈ సినిమా నేను చేయడం నా జీవితంలోని అతి పెద్ద మిస్టేక్ అని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో అనుష్క ఘాటి మూవీతో మన ముందుకు వచ్చింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.(Anushka)

Share your love