Pawan Kalyan: 20 ఏళ్ల రూల్ “ఓజీ” కోసం బ్రేక్ చేసిన పవన్ కళ్యాణ్.!

Pawan Kalyan breaks 20-year rule for "OG"

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి విడుదల కాబోతున్న తాజా మూవీ ఓజీ. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ పేరుతో విడుదలవుతున్న ఈ సినిమాకి సుజీత్ డైరెక్షన్ వహించగా..డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ సినిమాని నిర్మించారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయి మరో నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి రెడీగా ఉంది.

Pawan Kalyan breaks 20-year rule for “OG”

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది.అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మనకు గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఓజీ మూవీ కోసం దాదాపు 20 ఏళ్లుగా ఫాలో అవుతున్న ఒక రూల్ ని బ్రేక్ చేశారట. మరి ఇంతకీ ఓజీ మూవీ కోసం పవన్ కళ్యాణ్ బ్రేక్ చేసిన ఆ రూల్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.(Pawan Kalyan)

Also Read: Siddhu Jonnalagadda: ” ఆ రోజు వరకు ఉంటానో పోతానో తెలియదు”.. సిద్ధూ జొన్నలగడ్డ షాకింగ్ పోస్ట్.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజి మూవీ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన ఎస్.ఎస్.తమన్ తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టారు.అదేంటంటే.. ఓజీ మూవీ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏకంగా 20 ఏళ్లుగా ఫాలో అవుతున్న రూల్ ని బ్రేక్ చేశారని తమన్ చెప్పారు. మరి ఇంతకీ పవన్ బ్రేక్ చేసిన ఆ రూల్ ఏంటయ్యా అంటే..రికార్డింగ్ థియేటర్ కి రావడం..

Pawan Kalyan breaks 20-year rule for "OG"

అయితే పవన్ కళ్యాణ్ దాదాపు 20 ఏళ్ల క్రితం అంటే ఖుషి సినిమా సమయంలో రికార్డింగ్ థియేటర్ కి వెళ్లారట పవన్. అయితే ఆ తర్వాత దాదాపు 20 సంవత్సరాలుగా ఆయన ఎన్ని సినిమాలు చేసినా కూడా రికార్డింగ్ థియేటర్ కి వెళ్లలేదట.కానీ 20 ఏళ్ల రూల్ ని బ్రేక్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ కోసం రికార్డింగ్ థియేటర్ కి వచ్చారని తమన్ చెప్పుకొచ్చారు. ఓజీ ఫస్టాఫ్ లో వచ్చే మెయిన్ సీక్వెన్స్ పవన్ కళ్యాణ్ స్వయంగా చూశారని అవుట్ పుట్ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారంటూ తమన్ చెప్పుకొచ్చారు.(Pawan Kalyan)

Share your love