
OG Movie USA Review:పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. ఆయన సినిమాలకు దూరంగా ఉండి చాలా రోజులు అవుతుంది.. అయినా పవన్ కళ్యాణ్ కు సినీ అభిమానులు అయితే తగ్గడం లేదు.. ఆయన నుంచి ఒక్క సినిమా వచ్చినా చాలు అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారి ఎదురు చూపులకు తగ్గట్టుగానే ఓజి వచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమవుతోంది..
“OG Movie USA Review”
అలాంటి ఈ తరుణంలో ఈరోజు రాత్రికి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. ఇదిలా నడుస్తున్న సమయంలో అమెరికాలో ఇప్పటికే ప్రీమియర్ షో లను వేసేశారు.. అమెరికాలో సినిమా చూసిన వారి అభిప్రాయాన్ని బట్టి చూస్తే ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్ స్టర్ గా మారి కొన్ని సంవత్సరాల పాటు ముంబైలో తన హవా సాగిస్తారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ముంబైని వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్తారు. ఈ సందర్భంలోనే విలన్ ఎంట్రీ ఇచ్చి అక్కడి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటే పవన్ మళ్లీ ముంబైకి వచ్చి ప్రజలకు ఎలా న్యాయం చేస్తారనేదే కథ. (OG Movie USA Review)
Also Read: OG Movie: స్క్రీన్ స్పేస్ తక్కువ ఉందని OG మూవీలో హీరోయిన్ రోల్ వదులుకున్న నటి.?
ఇక ఈ సినిమాని దర్శకుడు సుజీత్ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ ఇంతకుముందు సినిమాలు ఒక లెక్క ఓజి సినిమా మరో లెక్క అనే విధంగా ఇందులో చూపించారని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా ద్వారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకుంటున్నారని చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ అందరిని మెస్మరైజ్ చేస్తుందని తెలియజేస్తున్నారు. ఇక ఇంటర్వెల్ సీన్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందని, ఇలాంటి సీన్స్ ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదని చెబుతుండడం విశేషం.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని అంటున్నారు. మొత్తానికి ఓజి చిత్రం అద్భుతమైన హిట్ సాధించబోతుందని టాక్ వినిపిస్తోంది. అంతే కాదు ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ వంద కోట్ల క్లబ్లో చేరతాడని కూడా అంటున్నారు. మరి చూడాలి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఈ చిత్రం ఎలా మెప్పిస్తుందనేది మరికొన్ని గంటల్లో తెలియబోతోంది.(OG Movie USA Review)





Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ని అవమానించిన నిహారిక..!