Janasena: బాల‌య్యకు షాక్‌….స్సీక‌ర్ కు జ‌న‌సేన ఎమ్మెల్యేల ఫిర్యాదు ?

Janasena: నందమూరి బాలయ్య ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు నందమూరి బాలయ్య. జగన్మోహన్ రెడ్డి పెద్ద సైకో అంటూనే…. చిరంజీవిని వాడు వీడు అంటూ అసెంబ్లీలో రెచ్చిపోయారు నందమూరి బాలయ్య. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినీ ప్రముఖులందరూ టికెట్లు ధరలు పెంచాలని జగన్మోహన్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఫ్లైట్ వేయించి మరి… సినీ తారలను జగన్ వద్దకు తీసుకువెళ్లారు. అయితే ఈ విషయాన్ని గుర్తు చేసి నందమూరి బాలయ్య.. లేచిపోయారు. Janasena

Shock for Balayya JanaSena MLAs file complaint against Sseekar

మెగాస్టార్ చిరంజీవికి అవమానం జరిగేలా మాట్లాడారు. అయితే దీనిపై మెగాస్టార్ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వెంటనే నందమూరి బాలయ్య బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని.. డిమాండ్ చేస్తున్నారు. ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు చేయడమే కాకుండా బాలయ్య దిష్టిబొమ్మలు కూడా దగ్ధం చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో జనసేన పార్టీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారట. నందమూరి బాలయ్య అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను తొలగించేలా… స్పీకర్ కు ఫిర్యాదు చేయబోతున్నారట.

Also Read: Sana Mir Azad Kashmir: అజాద్ కశ్మీర్ వ్యాఖ్యలు.. సనా మిర్ వివాదం ఏంటీ…

అలాగే ఇకపైన నందమూరి బాలయ్య… మాట్లాడేటప్పుడు.. జాగ్రత్తగా ఉండాలని కూడా స్పీకర్ ద్వారా ఆదేశాలు ఇప్పించేందుకు జనసేన ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారట. దీనికోసం రేపు ఏపీ స్పీకర్ను కలవబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ అంశంపై పవన్ కళ్యాణ్ స్పందించని విషయం తెలిసిందే. అతను స్పందిస్తే పరిణామాలు వేరేలా ఉంటాయని.. జనసేన ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసే దిశగా వెళ్తున్నారట.

Also Read: Rahul Ramakrishna: సారే రావాలంటున్నాడే.. కేసీఆర్ ఏ కావాలంటున్నారే.. రాహుల్ రామకృష్ణ సంచలన పోస్ట్…

Share your love