The Raja Saab: “తప్పుచేసి నన్నే బెదిరిస్తున్నాడు”.. ది రాజా సాబ్ మూవీపై నిర్మాత సంచలన కామెంట్స్.?

Producer sensational comments on The Raja Saab movie

The Raja Saab: ది రాజా సాబ్ మూవీ పై తాజాగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు తప్పు చేసిందే కాకుండా నన్నే బెదిరిస్తున్నాడు.. డబ్బులు అన్ని తీసుకొని పని కరెక్టుగా చేయకుండా మమ్మల్ని బెదిరించాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఇంతకీ నిర్మాత మాట్లాడిన మాటలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడినవి. ఎవరు ఆయన్ని బెదిరిస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం..

Producer sensational comments on The Raja Saab movie

తాజాగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ది రాజా సాబ్ మూవీ ఈ ఏడాది ఏప్రిల్ లోనే విడుదల కావాల్సింది. కానీ ఈ సినిమా ఆలస్యం కావడానికి ప్రధాన కారణం నాసిరకమైన విఎఫ్ఎక్స్.. రాజా సాబ్ మూవీ కి విఎఫ్ఎక్స్ అందించిన మేనేజర్ కరెక్ట్ వర్క్ చేయలేదు. ఆయన నాసిరకం విఎఫ్ఎక్స్ అందించడంతో బాగా రాలేదు.ఇది చూసిన డైరెక్టర్ మారుతి ఇది బాలేదు అని నిలదీయగా.. డైరెక్టర్ నే బెదిరించాడు. (The Raja Saab)

Also Read: Vamshi Paidipally: టాప్ హీరోలతో మాత్రమే సినిమాలు.. వంశీ పైడిపల్లి కొత్త సినిమా ఎవరితో అంటే?

దాంతో విఎఫ్ఎక్స్ మేనేజర్ ని తీసేసి మరో విఎఫ్ఎక్స్ మేనేజర్ ని నియమించుకున్నాం. అందుకే సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడంతో పాటు సినిమాని వాయిదా వేసాం.అలా విఎఫ్ఎక్స్ మేనేజర్ డబ్బులు తీసుకోవడంతో పాటు తమనే బెదిరించారు అని నిర్మాత చెప్పిన కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ది రాజా సాబ్ మూవీ ప్రస్తుతం 90% షూటింగ్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది.

Producer sensational comments on The Raja Saab movie

అలాగే జనవరిలో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్స్ గా రిద్ధి కుమార్,మాళవిక మోహన్, నిధి అగర్వాల్ లో నటిస్తున్నారు.అలా ముగ్గురు భామలతో ప్రభాస్ రొమాన్స్ చేయబోతున్నారు. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో ఒకప్పటి ప్రభాస్ కామెడీని మళ్ళీ చూడబోతున్నాం.(The Raja Saab)

Share your love