Congress: రూ.500 కోట్ల భారీ స్కాం..మంత్రి జూపల్లి వ‌ర్సెస్ సీఎం రేవంత్ ?

Congress: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ స‌ర్కార్ లో పెను ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. రోజుకో గొడ‌వ తెర‌పైకి వ‌స్తోంది. మంత్రుల మ‌ధ్య గొడ‌వ‌లు, ఎమ్మెల్యేలు వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు, ఆరు గ్యారెంటీల‌పై ప్ర‌జ‌లు నిల‌దీయ‌డం లాంటి సంఘ‌ట‌న‌లు రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పులు తీసుకువ‌స్తున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో కాంగ్రెస్ స‌ర్కార్ లో మ‌రో వివాదం చోటు చేసుకుంది. Congress

Congress Minister Jupally vs CM Revanth

అల్లుడి కోసం సీఎం.. కొడుకు కోసం మంత్రి అన్న‌ట్లు బీఆర్ ఎస్ పార్టీ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. రూ. 500 కోట్ల రూపాయల లిక్కర్ హోలోగ్రాం టెండర్ కొట్లాట జ‌రుగుతోంద‌ట‌. మధ్యలో ఐఏఎస్ అధికారి సయ్యద్ రిజ్వి బలి అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. 3 సంవత్సరాల పదవీకాలం ఉండగానే వీఆర్ఎస్ తీసుకొని వెళ్లిపోయాడ‌ట‌ ఐఏఎస్ అధికారి. Congress

Also Read: Jubilee hills bypoll: వివాదంలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత.. ఈసీకి మాగంటి కుమారుడు ఫిర్యాదు..?

లిక్కర్ బాటిల్స్ మీద 500 కోట్ల హోలోగ్రాం టెండర్ తన అల్లుడికి కావాలని సీఎం రేవంత్ రెడ్డి, తన కొడుకుకు కావాలని మంత్రి జూపల్లి గొడవ చోటు చేసుకుంద‌ట‌. సీఎం, మంత్రి కొట్లాటలో మనస్తాపం చెంది వీఆర్ఎస్ తీసుకున్నాడ‌ట‌ ఐఏఎస్ అధికారి సయ్యద్ రిజ్వి. తన మాట వినకుండా రిజ్వికి వీఆర్ఎస్ ఎలా ఇస్తారు అంటూ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశార‌ట‌ మంత్రి జూపల్లి కృష్ణారావు. జూపల్లి మాటను పక్కనపెట్టి రిజ్వికి వీఆర్ఎస్ ఇచ్చార‌ట‌ రేవంత్. Congress

Also Read: Gadari Kishore Kumar: ‘దున్నపోతు’ అని తిట్టినా సిగ్గులేదా? గాదరి కిషోర్ స్ట్రాంగ్ కౌంటర్

Share your love