Ram Charan: రెండోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్.. ఉపాసన శ్రీమంతం వీడియోలో అది గమనించారా.!

Ram Charan is going to become a father for the second time

Ram Charan: మెగా ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ రెండోసారి తండ్రి కాబోతున్నాడు.2023లో క్లింకారకి జన్మనిచ్చిన ఉపాసన మరోసారి ప్రెగ్నెంట్ అయ్యింది.. రీసెంట్ గానే ఉపాసన ప్రెగ్నెన్సీ న్యూస్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఉపాసన బేబీ బంప్ ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి.కానీ తాజాగా శ్రీమంతం వీడియోతో ఉపాసన తల్లి కాబోతున్నట్టు అందరికీ క్లారిటీ వచ్చింది.

Ram Charan is going to become a father for the second time

తాజాగా ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో శ్రీమంతం చేసుకున్న వీడియోని షేర్ చేసింది.. ఉపాసనని కూర్చోపెట్టి మెగా ఫ్యామిలీ మొత్తం ఈ సీమంతం వేడుకని అంగరంగ వైభవంగా నిర్వహించింది.ఈ వేడుకలో రామ్ చరణ్,చిరంజీవి,సురేఖ,నాగబాబు, పద్మజ,నిహారిక,లావణ్య త్రిపాటి, చిరంజీవి సోదరీమణులు, పంజా వైష్ణవ్ తేజ్,చిరంజీవి తల్లి అంజనాదేవి,పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా, సుస్మిత తో పాటు ఉపాసన తల్లిదండ్రులు ఇలా వారి ఫ్యామిలీ మొత్తం ఉంది.(Ram Charan)

Also Read: Pradeep Ranganathan: నిర్మాతలకు లక్కీ స్టార్ గా మారిన ‘ప్రదీప్ రంగనాధన్’.. తక్కువ టైంలో హ్యుజ్ మార్కెట్!!

అంతేకాదు దగ్గుబాటి వెంకటేష్, నయనతార తన భర్త పిల్లలతో కలిసి ఈ వేడుకకు వచ్చింది. అలా ఎంతోమంది కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య ఉపాసన శ్రీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి.కానీ ఈ శ్రీమంతం వేడుకల్లో గమనిస్తే అల్లు ఫ్యామిలీ ఈ వేడుకకు దూరంగా ఉంది. అయితే ఈ విషయాన్ని వైరల్ చేస్తూ కొంత మంది అల్లు మెగా ఫ్యామిలీలో ఉన్న గొడవలు నిజమే..అందుకే మెగా ఫ్యామిలీ లో అంత పెద్ద సెలబ్రేషన్స్ జరిగితే అల్లు ఫ్యామిలీ దానికి దూరంగా ఉంది అని అంటున్నారు.

Ram Charan is going to become a father for the second time

ఇంకొంత మందేమో రీసెంట్ గానే అల్లు అరవింద్ తల్లి చనిపోయింది కాబట్టి అందుకే ఈ వేడుకకు దూరంగా ఉన్నారని అంటే.. అల్లు అరవింద్ తల్లి చనిపోతే అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ ఎలా చేశారు అది వేడుక కాదా అని ఇంకొంతమంది నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఉపాసన శ్రీమంతం వేడుకల్లో అల్లు ఫ్యామిలీ మిస్ అవ్వడంతో మరోసారి అల్లు మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న విభేదాలు తెరమీదకి వచ్చాయి.(Ram Charan)

https://www.instagram.com/reel/DQI-vdDk-k8/?utm_source=ig_web_copy_link
Share your love