
Vijay Varma: తెలుగు వాడు అయినప్పటికీ బాలీవుడ్లో స్థిరపడిన వారిలో నటుడు విజయ్ వర్మ ఒకరు.తమన్నా బాయ్ ఫ్రెండ్ గా ఇండస్ట్రీలో ఒక్కసారిగా వైరల్ అయిన ఈయన రీసెంట్ గా ఓ పాడ్ కాస్ట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆయన ఆ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. ఎప్పుడు సినిమాలు అంటూ బిజీ బిజీగా ఉండే నాకు గతంలో ఒక చేదు అనుభవం ఎదురయింది.గతంలో ముంబైలో నా అపార్ట్మెంట్లో ఒక్కడినే ఉండడం వల్ల ఒంటరినైపోయాను.అక్కడ ఓ చిన్న టెర్రస్ ఉండేది. అక్కడ కూర్చొని ఆకాశం చూస్తూ గడిపే వాడిని.
Vijay Varma dipression because Tamannaah break up
ఒకవేళ అది లేకపోతే నేను పిచ్చివాడిని అయిపోయే వాడిని కావచ్చు.చాలా డిప్రెషన్ లో ఉండి సోఫాకి అతుక్కుపోయేవాడిని. గదిలో నుండి బయటకు రావాలంటే ఎందుకో భయమేసేది. ఏం జరుగుతుందో తెలియలేదు. ఆ సమయంలో డిప్రెషన్ లో ఉన్న సమయంలో అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్,గుల్షన్ దేవయ్య లు నన్ను మామూలు మనిషిని చేశారు. మేం ముగ్గురం దాహడ్ వెబ్ సిరీస్ సమయంలో కలిసాం.(Vijay Varma)
Also Read: Singer Sunitha: నా భర్తతో నీకేం సంబంధం.. సింగర్ సునీతని అవమానించిన మ్యూజిక్ డైరెక్టర్ భార్య.!
ఆ సమయంలో మా మధ్య మంచి పరిచయం ఏర్పడి కలిసి డిన్నర్లకు వెళ్లడం అప్పుడప్పుడు కలుసుకోవడం వంటివి చేసాం. అంతేకాదు ఇరా ఖాన్ నేను డిప్రెషన్ లో ఉన్న సమయంలో వీడియో కాల్ చేసి నువ్విలా ఉంటే కుదరదు.వర్కౌట్స్ చేయు అంటూ వీడియో కాల్ లోనే వర్కౌట్స్ చేసి చూపించేది. అలా ఆగలేక నేను కూడా వర్కౌట్స్ చేసేవాడిని. అలాగే ఓ థెరపిస్ట్ నీ కలిసినప్పుడు డిప్రెషన్లో మునిగిపోయానని ఆయన చెప్పారు.

అలా ఆయన అందులో నుండి బయటపడడానికి కొన్ని టిప్స్ కూడా చెప్పారు. వాటిని ఫాలో అవుతూ ప్రస్తుతం ఆ డిప్రెషన్ నుండి బయట పడ్డాను అంటూ విజయ్ వర్మ చెప్పుకొచ్చారు. అయితే విజయ్ వర్మ మాటలు నెట్టింటి వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ తమన్నాతో బ్రేకప్ వల్లే విజయ్ వర్మ డిప్రెషన్ లోకి వెళ్ళారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.(Vijay Varma)


