
Anu Emmanuel: టాలీవుడ్ హీరోయిన్ అను ఇమ్మానియేల్.. ఈమె అవకాశం వచ్చినప్పుడల్లా అప్పుడప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది.అయితే ఈమె చేసిన సినిమాల్లో ఏవో 4,5 మూవీస్ మాత్రమే హిట్ అవ్వడంతో అవి అను ఇమ్మానుయేల్ కి అంతగా గుర్తింపు తెచ్చి పెట్టడం లేదు. ముఖ్యంగా ఈ హీరోయిన్ సెకండ్ హీరోయిన్గా, గెస్ట్ రోల్స్, ప్రాధాన్యత లేని పాత్రల్లో చేయడం వల్లే ఇండస్ట్రీలో ఆమెకి అనుకున్నంత గుర్తింపు రావడంలేదని తెలుస్తోంది. అయితే ఇదే విషయాన్ని తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్స్ లో కూడా బయట పెట్టింది అను ఇమ్మానియేల్.
Anu Emmanuel is emotional saying that the film with Pawan and Bunny has ruined her career
ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా కెరీర్ లో ఎంతోమంది పెద్ద హీరోలతో సినిమాలు చేశాను. అల్లు అర్జున్, రవితేజ, పవన్ కళ్యాణ్, కార్తీ,నాని, శివ కార్తికేయన్ వంటి హీరోలతో నటించాను. కానీ నేను ఇంత పెద్ద స్టార్స్ తో చేసినా కూడా కొంతమంది హీరోలతో ఆ సినిమాలు చేయకపోయి ఉంటే బాగుండు అని రిగ్రెట్ గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే కొన్ని సినిమాల్లో కేవలం నాలుగు డ్యాన్స్ స్టెప్పులు, రెండు డైలాగుల వరకే పరిమితమైపోయాను. ఇలాంటి సినిమాలు చేసి చాలా బాధ పడుతున్నాను.(Anu Emmanuel)
Also Read: Vadde Naveen: డబ్బున్నోడనే పొగరు.. అందుకే వడ్డే నవీన్ కెరీర్ నాశనం.. దర్శకుడు బయట పెట్టిన నిజం.!
ఇకపై ఇలాంటి సినిమాల్లో చేయకూడదు అని ఫిక్స్ అయ్యాను. ఇలా ఎంత పెద్ద స్టార్స్ తో చేసినా కూడా ప్రాముఖ్యత లేని పాత్రల్లో చేయడం వల్ల నటిగా సంతృప్తి చెందలేదు. అందుకే ఇప్పటినుండి అలాంటి సినిమాల్లో అవకాశాలు వచ్చినా చేయకూడదని నిర్ణయించుకున్నా.అలా అని అవకాశాల కోసం ఏ పాత్ర అయినా చేస్తానని కాదు.నాకు రాసిపెట్టిన పాత్ర నాకోసం కచ్చితంగా వెతుక్కుంటూ వస్తుంది.

స్టార్ హీరోలతో చేశాననే సంతృప్తి ఉంది కానీ సినీ కెరియర్ పరంగా మాత్రం చాలా అసంతృప్తితో ఉన్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది అను ఇమ్మానియేల్. ఇక అను ఇమ్మానియేల్ రవితేజతో రావణాసుర, పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి, అల్లు అర్జున్ తో నా పేరు సూర్య, నానితో మజ్ను వంటి సినిమాలు చేసింది. మరి ఈ హీరోయిన్ ఏ హీరో సినిమా చేసి రిగ్రేట్ గా ఫీల్ అవుతుందో తెలియాల్సి ఉంది.(Anu Emmanuel)



