RCB: చిన్న‌స్వామిలో నో ఐపీఎల్..షాక్ లో బెంగ‌ళూరు ఫ్యాన్స్?

RCB: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జ‌ట్టు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ సారి జరిగే ఐపీఎల్ మ్యాచ్ లు చిన్న స్వామి స్టేడియంలో నిర్వహించేలా కనిపించడం లేదు. చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించకుండా మహారాష్ట్రలోని పూణే స్టేడియంలో మ్యాచ్ లు నిర్వహించేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం నిర్ణయం తీసుకుందట. RCB

No IPL for RCB Chinnaswamy

హోమ్ మ్యాచులన్నీ పూణేలోనే నిర్వహించాలని రంగం సిద్ధం చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ 2025 విజేతగా నిలిచిన బెంగళూరు జట్టు విజయోత్సవంలో తొక్కిసలాట జరిగింది. దీంతో దాదాపు 11 మంది మరణించారు. అయితే ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ లు నిర్వహించకుండా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. RCB

Also Read: Tollywood: టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు

ఇది ఇలా ఉండగా వచ్చే సంవత్సరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును విక్రయించేందుకు కూడా యాజమాన్యం సిద్ధమైంది. మార్చిలో ఈ జట్టుకు కొత్త ఓనర్ కూడా రాబోతున్నాడు. ఈ షాక్ లో ఉన్న రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు అభిమానులకు ఇప్పుడు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ లు నిర్వహించకపోవడం మరో దెబ్బ. RCB

Also Read: Jagan: బెంగళూరులో మంతనాలు..రెండు ఆయుధాలతో రంగంలోకి జగన్, ఇక కూటమి కుదేలే?

Share your love