
Akhanda 2: నందమూరి బాలయ్య నటించిన అఖండ 2 కారణంగా సీఎం రేవంత్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు చెబితే రేవంత్ రెడ్డి అఖండ2 సినిమా టికెట్ రేట్లు పెంచాడని కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలనం ఆరోపణలు చేసినట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే, రేవంత్ రెడ్డిపై ఏఐసీసీ అధిష్టానానికి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. Akhanda 2
Akhanda 2 effect to cm revanth reddy
మేము చంద్రబాబు నాయుడు మీద పోరాటం చేస్తుంటే, రేవంత్ రెడ్డి మాత్రం ఆయన చెప్పింది చేస్తున్నాడని షర్మిల అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ విషయంపై ఏఐసీసీ పెద్దలు ఆరా తీసి తెలంగాణ కాంగ్రెస్ నాయకులను హెచ్చరించినట్లు.. దీనివల్లే ఇకపై టికెట్ రేట్లు పెంచబోమని కోమటిరెడ్డి ప్రకటించినట్లు సమాచారం అందుతోంది. Akhanda 2
Also Read: Konda Surekha: బస్వరాజు సారయ్య కుట్రలు…కొండా దంపతులను వీడుతున్న నేతలు ?
ఇక అటు అఖండ2 సినిమా టికెట్ ధరల పెంపు నాకు తెలియకుండా జరిగింది అంటున్నారు సినిమా ఆటోగ్రాఫర్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇక ముందు ఎలాంటి సినిమాలకు టికెట్ ధరలు పెంచేది లేదని వెల్లడించారు. హీరోలకు అన్ని కోట్ల రెమ్యూనరేషన్ ఎందుకు ఇస్తున్నారు? అని ఫైర్ అయ్యారు. సినీ ఇండస్ట్రీ వ్యక్తులు ఎవరూ టికెట్ ధరలు పెంచమని నన్ను అడగకండి హెచ్చరించారు సినిమా ఆటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. Akhanda 2
Also Read: Kavitha: నేను ముఖ్యమంత్రి అవుతా..కేటీఆర్ ను జైలుకు పంపిస్తా?





