Cm Revanth Reddy: మూసీ ప్రక్షాళనను అడ్డుకునే వారి మీద శివతాండవం చేస్తా

Cm Revanth Reddy
Cm Revanth Reddy

Cm Revanth Reddy: మూసీ ప్రక్షాళనను అడ్డుకునే వారి మీద శివతాండవం చేస్తాను అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మూసీ నది ఒడ్డున నిర్మించే శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయం భూమి పూజ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. Cm Revanth Reddy

Cm Revanth Reddy ground-breaking ceremony of the Sri Omkareshwara Swamy temple to be built on the banks of the Musi River

ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకునే వారి మీద శివతాండవం చేస్తాన‌ని గులాబీ పార్టీ నేత‌ల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. మూసీ ప్రాజెక్ట్ మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పట్లోల్ల కార్తీక్ రెడ్డి కేసు వేశాడని మండిప‌డ్డారు. Cm Revanth Reddy

Also Read: Raj Gopal Reddy : కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ డిన్నర్ మీటింగ్!

వాళ్ళు చేయలేని పని నేను చేస్తే నాకు మంచి పేరు వస్తుందని కేసు వేశాడని సీరియ‌స్ అయ్యాడు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ మీద కార్తీక్ రెడ్డి కేసు వేస్తే ప్రజాప్రతినిధిగా సబితక్క కొనసాగే అర్హత లేదని విమ‌ర్శ‌లు చేశారు రేవంత్ రెడ్డి. ఎవ‌రెన్ని కుట్ర‌లు చేసినా, మూసీ ప్రాజెక్ట్ ఎక్క‌డా ఆగ‌బోద‌న్నారు. Cm Revanth Reddy

Also Read: VIJAY THALAPATHY : రజినీకాంత్ ను బెదిరించిన డీఎంకే.. టీవీకే నేత కామెంట్స్ వివాద‌స్ప‌దం..!

Share your love