

Etela Rajender: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో జంపింగ్ జపంగ్ స్టార్ట్ అయింది. చాలామంది నేతలు గులాబీ పార్టీ వైపు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ, ప్రధాన ప్రతిపక్షం గులాబీ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ ప్రతిపక్ష హోదాలో అద్భుతంగా ముందుకు వెళుతుంది. Etela Rajender
Etela Rajender said my boss is KCR
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేస్తోంది కెసిఆర్ పార్టీ. అందుకే జనాలందరూ గులాబీ పార్టీకి జై కొడుతున్నారట. ఇలాంటి నేపథ్యంలోనే తెలంగాణ బిజెపి పార్లమెంటు సభ్యులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. ఓ ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడుతూ మా బాస్ కెసిఆర్ అంటూ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. Etela Rajender
Also Read: Ajit Pawar-plane crash: విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి
ఇక ఈ వీడియో గులాబీ పార్టీ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఈటల రాజేందర్ పార్టీ మారబోతున్నారని… కెసిఆర్ సమక్షంలో గులాబీ పార్టీ కండువా కప్పుకుంటారని కూడా అంటున్నారు. బయటకు వెళ్లిన ఆరూరి రమేష్ తరహాలోనే ఇప్పుడు ఈటల రాజేందర్ రాబోతున్నాడని కూడా ప్రచారం సాగిస్తున్నారు గులాబీ నేతలు. Etela Rajender
Also Read: Deputy CM Ajit Pawar : అజిత్ పవార్ విమాన ప్రమాదంపై సంచలన వీడియో







