CM REVANTH REDDY : రేవంత్ రెడ్డి సంచ‌ల‌నం.. కాంగ్రెస్‌ ఆఫీసులకు జిల్లాల్లో భూకేటాయింపులు..?

CM REVANTH REDDY : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌నం సృష్టిస్తున్నాడు. ముఖ్యంగా కాంగ్రెస్ ఆఫీసుల కోసం భూ కేటాయింపున‌కు ఆమోదం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన‌ తెలంగాణ క్యాబినెట్ భేటీలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ప్ర‌ధానంగా ప్ర‌భుత్వ ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్య భ‌ద్ర‌త తో పాటు హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర అభివృద్ధి, భూ కేటాయింపుల‌పై విస్తృతంగా చ‌ర్చించారు. CM REVANTH REDDY

cm-revanth-reddy-movement-land-allocations-in-districts-for-congress-offices

హైద‌రాబాద్ మెట్రో ను L & T నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పేరును డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌గా మార్పు చేయ‌నున్న‌ట్టు ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇక నుంచి ప్ర‌భుత్వ ప‌రిధిలోకి రానున్నారు TVVP ఉద్యోగులు. CM REVANTH REDDY

Also Read : Chandrababu: పాల కల్తీపై సీఎం చంద్రబాబు ప్ర‌క‌ట‌న‌..మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు !

గుమ్మ‌డూరులో JNTU కాలేజీ నిర్మాణానికి 70 ఎకరాలు కేటాయింపు చేశారు. అలాగే ఖమ్మంలో టీటీడీకి 20 ఎకరాల భూమి కేటాయింపున‌కు ఆమోదం తెలిపారు. హెచ్ఎండీఏ ప‌రిధిలోకి కొత్త గ్రామాల చేరిక‌, ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం, 2027 జ‌న‌గ‌ణ‌న ఏర్పాట్లు వంటి ప‌లు ఇత‌ర కీల‌క అంశాల‌పై కూడా కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా ప్ర‌భుత్వ ఉద్యోగులు, పెన్ష‌న‌ర్ల కోసం ఉచిత ప్ర‌మాద బీమా ప‌థ‌కాన్ని.. న‌గదు ర‌హిత వైద్య సేవ‌ల కోసం క్యాష్ లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ను అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది ప్ర‌భుత్వం.

Also Read : Congress: కేరళ ఎన్నికలకు తెలంగాణ సొమ్ము.. రూ.1000 కోట్లు ?

Share your love