MP DHARMAPURI ARVIND : బీజేపీ కోవ‌ర్టు వ్య‌వ‌హారాల‌పై ఎంపీ అర‌వింద్ ఫైర్..!

MP Arvind

MP DHARMAPURI ARVIND : జ‌గిత్యాల బీజేపీలో కోవ‌ర్టు రాజ‌కీయ వ్య‌హారాలు జ‌రుగుతున్నాయ‌ని గ‌త మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో తేట తెల్ల‌మైంది. తాజాగా ఈ బీజేపీ కోవ‌ర్టు వ్య‌హ‌హారాల‌పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా స్పందించారు. పార్టీలో ఉన్న కోవర్టుల కారణంగానే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం లేదని ఆయన పేర్కొన్నారు. కోవర్టు రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు.

MP ARVIND FIR ON COVERT AFFAIRS OF BJP

తాజాగా జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఆయన.. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా భోగ శ్రావణి ఇంటిపై పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేతలు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకుంటున్నవారు పార్టీలోనే ఉన్న కోవర్టులేనని ఆరోపించారు. ఇలాంటి నాయకులను పార్టీ నుంచి తప్పకుండా బయటకు పంపుతామని ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ హెచ్చరించారు.

Also Read : CM CHANDRABABU : సొంత కూట‌మిలో బీజేపీ ప్లాన్.. షిండే, నితీశ్.. నెక్ట్స్ చంద్ర‌బాబేనా..?

మరోవైపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై కూడా విమర్శలు గుప్పించారు. కోవర్టు రాజకీయాలు మానుకోవాలని ఆయనకు హితవు పలికారు. బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. భోగ శ్రావణి ఉదాహరణను ప్రస్తావిస్తూ.. ఆమె పార్టీ మారేటప్పుడు తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిందని చెప్పారు. ఒక మహిళ అయిన ఆమెను చూసి ఎమ్మెల్యే నేర్చుకోవాలని సూచించారు. కేంద్రీయ‌ విద్యాలయానికి పది ఎకరాల భూమి కేటాయించడంలో ప్రభుత్వానికి ఇబ్బంది ఏమి ఉందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఒప్పించి అయినా కేంద్రియ విద్యాలయం కోసం భూమి కేటాయింపును సాధించాలన్నారు. ఎమ్మెల్యే సంజ‌య్ కుమార్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, అవి మానుకోవాల‌న్నారు ఎంపీ అరవింద్.

Also Read : TTD CHAIRMAN : టీటీడీ చైర్మ‌న్ గా ఏబీఎన్ రాధాకృష్ణ‌న్..?

Share your love
పక్కా ఫిల్మీ లోగో

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_