FUNCTION HALL : దావత్‌లకు సంబంధం లేని వ్యక్తులు వస్తే 3 నెలల జైలు శిక్ష

function Hall

FUNCTION HALL : సాధార‌ణంగా పెళ్లి జ‌రుగుతుందంటే.. బంధువులు, స్నేహితులు, కుటుం స‌భ్యులు అంద‌రూ విచ్చేసి సంబురంగా జ‌రుపుకుంటారు. అది అంతా ఇంటి వ‌ద్ద జ‌రిగే సంబురం. కానీ ఈ మ‌ధ్య కాలంలో పెళ్లిల‌ను ఎవ్వ‌రూ ఇంటి వ‌ద్ద జ‌ర‌ప‌కుండా ఫంక్ష‌న్ హాళ్ల‌లో జ‌రిపేందుకు ప్రాధాన్య‌త ఇస్తున్నారు. తాజాగా మానుకోట ప‌ట్ట‌ణంలో పెళ్లిళ్లు జ‌రిగే ఫంక్ష‌న్ హాళ్ల వ‌ద్ద పెళ్లికి సంబంధం లేని వ్య‌క్తులు ఫంక్ష‌న్ హాళ్ల వైపు వెళ్లి భోజ‌నం చేయ‌డంతో కొంత మందికి భోజ‌నం స‌రిపోవ‌డంలేద‌ని ఫంక్ష‌న్ హాల్స్ ముందు ఏర్పాటు చేసిన హెచ్చ‌రిక బోర్డులు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

THREE MONTHS IMPRISONMENT IF UNRELATED PEOPLE ATTEND DAWATS FUCTION HALL

ఈ మ‌ధ్య కాలంలో ఫంక్షన్ హాల్స్‌లో జరిగే పెళ్లిళ్లకు సంబంధంలేని కొందరు వ్యక్తులు వెళ్లి విందు భోజనం చేసి వెళ్లే ఘటనలు రోజు రోజుకు విప‌రీతంగా పెరుగుతున్నాయని ఫంక్ష‌న్ హాల్ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తగా ఈ బోర్డులు ఏర్పాటు చేసినట్టు వారు చెబుతున్నారు. ఫంక్షన్ హాల్ ప్రవేశ ద్వారాల వద్ద ఏర్పాటు చేసిన బోర్డుల్లో “సంబంధం లేని వ్యక్తులు దొరికినచో సెక్షన్ 441 ప్రకారం.. మూడు నెలల జైలు శిక్ష లేదా రూ.5,000 వరకు జరిమానా విధించబడును” అని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.

Also Read : MLA ANIRUDH REDDY : తెలంగాణ‌లో మ‌ళ్లీ సారా దుకాణాలు తెర‌వాలి.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఆహ్వానం లేకుండా పెళ్లి వేడుకలకు వచ్చే వారిని అరికట్టడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బోర్డుల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ పట్టణంలో చర్చనీయాంశంగా మారాయి. పెళ్లి వేడుకలకు ఆహ్వానం ఉన్నవారే హాజరుకావాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.

Also Read : Patnam Suneetha Mahender Reddy: నాకు ఓడిపోయే సీటు ఇచ్చి, రేవంత్ సీఎం అయ్యాడు

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu