KTR : లక్షన్నర కోట్ల విలువైన ఆస్తిని జీరో వాల్యూ చేసే అధికారం రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారు?

ktr
ktr

KTR : లక్షన్నర కోట్ల విలువైన ఆస్తిని జీరో వాల్యూ చేసే అధికారం రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌శ్నించారు. హిమాయ‌త్ న‌గ‌ర్ సాగ‌ర్ బ‌స్తీ ప్ర‌జ‌ల గోడును విన్న ఆయ‌న‌.. త‌మ హయాంలో మూసీ సుంద‌రీక‌ర‌ణ ఫొటోల‌ను వెబ్ సైట్ లో పెట్టార‌ని తెలిపారు. అధికారులు మూసీ సుందరీకరణ వెబ్ సైట్ లో కొన్ని ఫోటోలు పెట్టారు. ఆ ఫోటోలు కూడా మా ప్రభుత్వంలో చేసిన మూసీ సుందరీకరణ ఫోటోలే అన్నారు. 3,279 ఎకరాలు, 10వేల నిర్మాణాలు తీసుకుంటామని మొన్న ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. KTR

Who gave Revanth Reddy the authority to zero value a property worth one and a half crores

పక్కనే కోకాపేటలో ఎకరం 100 కోట్లు ఉంది. ఇక్కడ కనీసం 50 కోట్లు ఉండదా? అని ప్ర‌శ్నించారు. బీఆర్‌ఎస్ హయాంలోనూ మూసీ సుందరీకరణ చేపట్టామని.. కానీ తాము రేవంత్ రెడ్డిలా డబ్బాలు కొట్టలేదని కేటీఆర్ విమర్శించారు. అధికారులు మూసీ సుందరీకరణ వెబ్‌సైట్ లో కొన్ని ఫోటోలు పెట్టారని, అవి తమ ప్రభుత్వం నాటి మూసీ సుందరీకరణ ఫోటోలేనని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తొలి దశ కోసం 3,279 ఎకరాలు, 10వేల నిర్మాణాలు తీసుకుంటామని ప్రభుత్వం గెజిట్ ఇచ్చిందనే విషయాన్ని ప్రస్తావించిన కేటీఆర్‌.. పక్కనే కోకాపేటలో ఎకరం 100 కోట్లు ఉన్నపుడు, ఇక్కడ కనీసం 50 కోట్లు ఉండదా? అని ప్రశ్నించారు. లక్షన్నర కోట్ల విలువైన ఆస్తిని జీరో వాల్యూ చేసే అధికారం రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారు? అని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు నిలదీశారు.

Also Read : JEEVAN REDDY : రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి బిగ్ షాక్..!


మూసీ ప్రాజెక్టు కోసం కూలగొట్టే ఒక అపార్ట్‌మెంట్‌లో ముగ్గురు జర్నలిస్టులు ఉన్నారు. వారిని కాకా పట్టడానికి రేవంత్ శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఆ అపార్ట్మెంట్ పక్కనే వాళ్ళకి 7 ఎకరాలు ఇస్తాను. అందులో అంతకంటే మంచి అపార్ట్‌మెంట్‌లు కట్టిస్తాను అని రేవంత్ రెడ్డి చెబుతున్నాడు. మరి హిమాయత్‌సాగర్ లో బస్తీ ప్రజలకు కూడా పక్కనే స్థలం ఇస్తావా? అపార్ట్‌మెంట్‌ వాళ్లకు ఇచ్చినప్పుడు వీళ్లకు కూడా ఇవ్వాలి కదా అన్నారు.

Also Read : Pawan Kalyan: చంద్రబాబు సీరియస్? మంత్రుల గైర్హాజరుపై రాజకీయ వర్గాల్లో చర్చ!!

Share your love