Maa Inti Bangaram: వంద కోట్ల క్లబ్‌లో సమంత చిత్రం – ఫిమేల్ ఓరియెంటెడ్ రికార్డు

సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల క్లబ్‌లో చేరి చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా చిత్ర బృందం కొత్త పోస్టర్‌తో ఈ విజయాన్ని ప్రకటించింది. తెలుగు సినీ చరిత్రలో 100 కోట్లు దాటిన తొలి ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రంగా ఇది రికార్డు సాధించింది. సమంత ఫ్యాన్స్ ఈ వార్తతో సంతోషంలో ఉన్నారు.

నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 19, 2026న విడుదలైంది. గౌతమి, శ్రీలక్ష్మి, శ్రీముఖి, గుల్షన్ దేవయ్య వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. రాజ్ నిడిమోరు కథ, స్క్రీన్‌ప్లే అందించగా, ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత స్వయంగా నిర్మించారు. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో కలెక్షన్స్ భారీగా వస్తున్నాయి.

‘మా ఇంటి బంగారం’ మహిళా ప్రధాన నటిగా తెలుగులో గోల్డెన్ సెంచరీ సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. #మాఇంటిబంగారం, #MiB ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల గ్రాస్ వసూలు చేసి ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాల విభాగంలో కొత్త record ను నెలకొల్పింది. సమంత నటనకు ప్రేక్షకులు మెచ్చడంతో బాక్సాఫీస్ వద్ద ఇంత మంచి ఫలితం వచ్చింది.

ఈ సినిమా విజయం సమంతకు పెద్ద ఊతమిచ్చింది. ట్రలాలా పిక్చర్స్ ఈ milestone ను సోషల్ మీడియాలో ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలు మరింత మార్కెట్ లో రాణించేలా ఈ సినిమా దోహదపడుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Share your love