Tipper accident: మూసాపేటలో టిప్పర్‌ ఢీకొని ఇద్దరు విద్యార్థులు మృతి

మూసాపేటలో టిప్పర్ accidentలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. క్రికెట్‌ ఆడేందుకు బైక్‌పై వెళ్తున్న ముగ్గురు ఇంటర్‌ విద్యార్థులను టిప్పర్‌ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. టిప్పర్ accident ఇలా హఠాత్తుగా జరిగి యువ ప్రాణాలను బలితీసుకుంది.

Teen Students Killed in Tipper Accident

మృతుల వివరాల్లోకి వెళ్తే, యూసుఫ్‌గూడకు చెందిన బేగరి మహేష్‌ (17), మన్నె లక్ష్మీతేజ (17) అమీర్‌పేటలోని అరోమా జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. మరో స్నేహితుడు పులి కిరణ్‌కుమార్‌ (17) అమృత కాలేజీలో చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ముగ్గురూ కలిసి క్రికెట్‌ ఆడేందుకు ఉదయం 4 గంటలకు ఇంటి నుంచి బయలుదేరారు.

ఆట ముగించుకుని మహాలక్ష్మీ కేఫ్‌లో టీ తాగేందుకు మూసాపేట నుంచి కేపీహెచ్‌బీ కాలనీ వైపు వెళుతుండగా, మెట్రో ఫిల్లర్‌ 796 దగ్గర టిప్పర్‌ డ్రైవర్‌ ఆకస్మికంగా కుడి వైపు తిప్పడంతో బైక్‌కు ఎదురైంది. ఈ accidentలో బైక్ నడుపుతున్న కిరణ్‌కు తీవ్ర గాయాలు కాగా, వెనుక కూర్చున్న మహేష్‌, లక్ష్మీతేజ టిప్పర్ చక్రాల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

స్థానికులు కిరణ్‌ను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా, పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి పంపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని లారీని స్టేషన్‌కు తరలించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ టిప్పర్ accident పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share your love